ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:38 AM
జిల్లాలో మొదటి రోజు పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు సబ్జెక్టు పరీక్షకు మొత్తం 50 పరీక్షా కేం ద్రాల్లో 8,627 మంది విద్యార్ధులకు 8,616 హాజరు కాగా, 11మంది గైర్హాజరయ్యారు.

భువనగిరి (కలెక్టరేట్), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మొదటి రోజు పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు తెలుగు సబ్జెక్టు పరీక్షకు మొత్తం 50 పరీక్షా కేం ద్రాల్లో 8,627 మంది విద్యార్ధులకు 8,616 హాజరు కాగా, 11మంది గైర్హాజరయ్యారు. భువనగిరి గంజ్ పాఠశాలలో జరుగుతున్న పరీక్షలను కలెక్టర్ ఎం.హనుమంతరావు, జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారి కే.సత్యనారాయణ సందర్శించగా, 20 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ సందర్శించారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారని, అవసరమైన అన్ని మౌళిక వసతులను కల్పించామని డీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.భువనగిరి టౌన్: పదో తరగతి పరీక్షలు శుక్రవారం భువనగిరిలో ప్ర శాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో ఏర్పాటు చేసిన ఎనిమిది కేంద్రాల్లో 1,361 మంది విద్యార్థులకు 1,360మంది హాజరుకాగా ఒకరు గైర్హాజరయ్యారు. కలెక్టర్ ఎం.హనుమంతరావు, డీఈవో కె.సత్యనారాయణ వేర్వేరుగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కాగా తొలిరోజున పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రుల సందడి నెలకొన్నది.