Share News

జమిలి ఎన్నికలతోనే దేశాభివృద్ధి

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:40 AM

ఒక దేశం..ఒకే ఎన్నికల నినాదంలో భాగంగా బీజేపీ ప్రతిపాదించే జమిలి ఎన్నికల విధానంతో దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ నాయకులు అన్నారు.

జమిలి ఎన్నికలతోనే దేశాభివృద్ధి

భువనగిరి టౌన, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఒక దేశం..ఒకే ఎన్నికల నినాదంలో భాగంగా బీజేపీ ప్రతిపాదించే జమిలి ఎన్నికల విధానంతో దేశాభివృద్ధి సాధ్యమని బీజేపీ నాయకులు అన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల సదస్సులు నిర్వహించి, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. దేశంలో జమిలి ఎన్నికల వ్యవస్థను విచ్చిన్నం చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఏలే చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం భువనగిరిలో జరిగిన వన నేషన-వన ఎలక్షన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ప్రభుత్వం పారదర్శక పాలన, ధనం, సమయం వృధాను అరికట్టేందుకు జమిలి ఎన్నికలను ప్రతిపాదిస్తోందని ఇందుకు ప్రజలందరూ మద్దతూ ఇవ్వాలని అన్నారు. బీజేపీ పట్టణ శాఖ అధ్యక్ష కార్యదర్శులు రత్నపురం బలరాం, రాళ్లబండి కృష్ణాచారి, వన-నేషన వన-ఎలక్షన పట్టణ కన్వీనర్‌ పట్టణ కన్వీనర్‌ పాదరాజు ఉమాశంకర్‌రావు పాల్గొన్నారు.

ు.

Updated Date - Mar 23 , 2025 | 12:40 AM