Share News

గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ABN , Publish Date - Mar 23 , 2025 | 12:36 AM

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌ రెడ్డి ఆరోపించారు. వాజపేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం చౌటుప్పల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి

చౌటుప్పల్‌ టౌన్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌ రెడ్డి ఆరోపించారు. వాజపేయి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం చౌటుప్పల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి వాజపేయి చేసిన సేవలను కొనియాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో బీజేపీ మునుగోడు అసెంబ్లీ కన్వీనర్‌ దూడల భిక్షంగౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రామనగోని శంకర్‌, కిసాన్‌ మోర్చ జిల్లా మాజీ అధ్యక్షుడు ముత్యాల భూపాల్‌రెడ్డి, బీజేపీ పట్టణ, రూరల్‌ మండల అధ్యక్షులు కడారి కల్పన, కె.అశోక్‌, నాయకులు సురేందర్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, వనం ధనుంజయ్య, ఆలె చిరంజీవి, వెంకటేశ్‌, పురుషోత్తం పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 12:36 AM