‘కార్మిక’ సంఘం ఎన్నిక రసవత్తరం
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:25 AM
(ఆంధ్రజ్యోతి- యాదగిరిగుట్టరూరల్ ) యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ప్రీమియర్ కంపెనీలో ఈ నెల 29న కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నారు.

(ఆంధ్రజ్యోతి- యాదగిరిగుట్టరూరల్ ) యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం ప్రీమియర్ కంపెనీలో ఈ నెల 29న కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నారు. మూడేళ్లకోసారి జరిగే యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో గెలుపుకోసం కార్మిక సంఘాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రధాన కంపెనీలో స్టాఫ్, కార్మికులు కలిసి మొత్తం 390 మందికి ఓటుహక్కు ఉంది. గతంలో బీఎంఎస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన బీఆర్‌ఎ్‌సకేవీ, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టీయూసీ కలిసి పోటీ చేశాయి. అందులో సీఐటీయూ, బీఎంఎస్ వేర్వేరుగా పోటీ చేయడంతో స్వల్ప మెజార్టీతో బీఆర్‌ఎస్‌కేవీ సీఐటీయూపై విజయం సాధించింది.
ప్రస్తుతం జరుగుతున్న గుర్తింపు ఎన్నికల్లో ఇప్పటికే బీఆర్‌ఎస్‌కేవీ, బీఎంఎస్ పొత్తులు కుదుర్చుకొని గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. కంపెనీ బీఆర్‌ఎ్‌సకేవీ గౌరవాధ్యక్షుడు డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో అధికారంలో బీఆర్‌ఎస్ అండగా ఉండి ఎమ్మెల్యే సైతం గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి ఉండటంతో ఆ యూనియన్‌కు గెలుపు రెండుసార్లు అదృష్టం కలిసి వచ్చింది. ఈ సారి అధికారం లేకపోవడం కేవలం ఆరేళ్లుగా కార్మికులకు ఆయూనియన్ అఽందించిన సేవలపైనే వారి గెలుపు ఆధారపడి ఉంది. దీంతో బీఎంఎస్ బీఆర్‌ఎ్‌సకేవీకి చెందిన కార్మికులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహిస్తూ కార్మికులందరిని కూడగట్టే విధంగా గొంగిడి మహేందర్‌రెడ్డి పావు లు కదుపుతున్నారు. ఎలాగైనా మూడోసారి గెలుపొందాలని తమకు బీఎంఎస్ మద్దతు ఇవ్వడం సునాయసంగా గెలుస్తామని ధీమాతో ఉన్నారు. సుమారు 130 ఓట్లు ఉండగా, బీఎంఎ్‌సకు సగానికి పైగా మద్దతు ఉన్నట్లు తెలిసింది. గతంలో తక్కువ మెజార్టీతో ఓడిపోయిన సీఐటీయూకు ప్రస్తుతం సుమారు 125 ఓట్లు ఉండగా ఐఎన్‌టీయూసీ 20, హెచ్‌ఎంఎ్‌సకు సుమారు 28 ఓట్లు, ఐఎన్‌టీయూసీ, ఐఎన్‌టీయూసీలు సైతం సీఐటీయూకు మద్దతు ప్రకటించిందని గతంలో కేవలం 3 ఓట్లతో ఓడిపోయిన సీఐటీయూ ఎలాగైనా ఈసారి గెలుపు తమ సొంతం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలు తీస్తోంది. గతంలో సీఐటీయూ వీడిపోయి కార్మికులతో సైతం విడివిడిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఐఎన్‌టీయూసీ ఉండటంతో కొంతవరకు అధికారపార్టీ అండ సైతం దొరికే అవకాశం లేకపోలేదు.
ఎవరికీ వారే ధీమా
ఎలాగైనాబీఆర్‌ఎ్‌సకేవీని ఓడించాలని ఆయా గ్రామాల్లో ఉండే కార్మికుల వద్దకు వెళ్లి తమ యూనియన్ పనితీరు కార్మికులకు నెర వేర్చే కోర్కెలను వారికి వివరిస్తూ కార్మికులను తమ వైపు తిప్పుతూ ఈ సారి కార్మికులు అందరూ సహకరించి సీఐటీయూని గెలిపించాలని జిల్లా స్థాయి నాయకులు ఇక్కడే మకాం వేసి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
దీంతో కంపెనీలో రసవత్తరంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారే గెలుపు తమదేనంటే తమదేనని ధీమాతో ఉన్నారు. కార్మికులు మరోసారి బీఆర్‌ఎ్‌సకేవీని మరోసారి గెలిపిస్తారా? లేక సీఐటీయూకి పట్టం కడతారో ఎదరు చూస్తున్నారు.