కవులకు పుట్టినిల్లు దేవరకొండ
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:47 PM
దేవరకొండ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కవులు, కళాకారులకు పుట్టి నిల్లు దేవరకొండ అని దేవరకొండ నియో జకవర్గ తెలంగాణ సాహితీ సాంస్కృతిక అధ్యాయన వేదిక (తెస్సా) అధ్యక్షుడు పర్చావాసుదేవరావు అన్నారు.

దేవరకొండ, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కవులు, కళాకారులకు పుట్టి నిల్లు దేవరకొండ అని దేవరకొండ నియో జకవర్గ తెలంగాణ సాహితీ సాంస్కృతిక అధ్యాయన వేదిక (తెస్సా) అధ్యక్షుడు పర్చావాసుదేవరావు అన్నారు. విశ్వవాసునామ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని దేవరకొండ గ్రంథాలయంలో శనివారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దేవరకొండకు చెందిన కవులు పుస్తకాలు, కవి లు రాస్తు కవిత రంగంలో రాష్ట్రస్థాయిలో రాణిస్తున్నారని అన్నారు. కవులు, కళాకారులకు, సాహితీవేత్తలకు ఎప్పుడు ఆదరణ ఉంటు ందన్నారు. విశ్వవాసునామ సంవత్సరంలో వర్షాలు సంవృద్దిగా కురుస్తా యని, పంటలు పండు తాయన్నారు. ఈకార్యక్రమంలో తెస్సా కార్యదర్శి రంజానబేగ్, బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివ ాస్‌గౌడ్, నేతాళ్ల వెంకటేష్, ఉడుత సలేశ్వర్‌యాదవ్, భిక్షమయ్య, టైగర్ జీవా, శ్రీనివాస్, వెంకటరమణ కవితలు చదివారు. అనంతరం తెస్సా అధ్యక్షుడు పర్చావాసుదేవరావును పలువురు కవులు సన్మానించారు.