Share News

ఎండుతున్న మొక్కలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:44 PM

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రభు త్వం ప్రతి ఏడాది జూన, జూలై మాసాల్లో మొ క్కలు నాటే కార్యక్రమం చేప డుతోంది. అయితే గ్రామ పం చాయతీలు, ఖాళీ ప్రదేశాలు, రహ దారులకు ఇరు వైపులా, నర్సరీల్లో మొక్కలు నాటేందుకు వాటిన సంరక్షించేందుకు రూ.లక్షల ఖర్చు చేస్తోంది. కానీ వాటి సంరక్షణ కరవువడంతో మొక్కలు నిలువునా ఎండి పోతున్నాయి. (ఆంధ్రజ్యోతి-డిండి)

  ఎండుతున్న మొక్కలు

మొక్కలునాటే కార్యక్రమం ప్రభుత్వం పదేళ్లుగా చేపట్టినప్పటికీ హరితవనాలు విస్తరించడం లేదు. 2024 జూన, జూలై నుంచి మండలంలో 20 వేల మొక్కలు నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందులో గ్రామ పంచాయతీలవారీగా బతికినవిఎన్నో, చనిపోయిన మొక్కలు ఎన్నో అధికారులు చెబుతున్నా వాటిని క్షేత్రస్థాయిలో ఉన్నదానికి పొంతనలేదు. హరితవనాలను పెంచే లక్ష్యం బాగున్నా ఆచర ణలో మాత్రం లక్ష్యానికి భిన్నంగా ఉంది. ప్రతి వాచర్‌ నాటిన 400 మొక్కలను సంరక్షించవలసి ఉంది. ఇందుకు జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.270 రోజుకు చెల్లిస్తారు. ఒక వాచర్‌ వంద రోజుల పనిదినాలకు మించి పని చేయరాదనే నిబంధన కూడ ఉంది. నాటిన మొక్కలకు ఆలనా, పాలనలేక ఎండల తీవ్రతకు మొక్కలు నిలువునా ఎండుతున్నాయి. డిండి నుంచి దేవరకొండకు వెళ్తున్న ప్రధాన రహదారికి ఇరువైపులా ప్రతి ఏడాది మొక్కలు నాటుతున్నప్పటికీ అవి ఆనవాళ్లు లేకుండా పోయాయి. మొక్కలు నాటేందుకు రూ.లక్ష ఖర్చు చేస్తున్నారే కాని వాటిపై పర్యవేక్షణ లేమి పొట్టొచ్చునట్లు కనిపిస్తుంది.

భారంగా మారిన ట్యాంకర్ల నిర్వహణ

నాటిన మొక్కలకు గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీరు పోయాల్సి ఉంటుంది. కానీ పంచాయతీ కార్యదర్శులు మాత్రం నిధులలేమితో వాటర్‌ ట్యాంకర్ల నిర్వహణ భారంగా మారింది. ఇప్పటికే తాను రూ. 1.40 లక్ష అప్పుచేసి చేతి నుంచి ఖర్చు చేసినట్లు ఓ గ్రామకార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. పంచా యతీలకు స్టేట్‌ ఫైనాన్స నుంచి 2024 ఆగస్టులో చిన్న పంచా యతీలకు రూ. 50వేలు, మేజర్‌పంచాయతీ లకు రూ.లక్ష విడుదలయ్యాయి. తరువాత నిధులు విడుదల కాలేదు. టీఎస్‌ బీపాస్‌ ద్వారా పారిశుధ్య కార్మికులకు మాత్రం వేతనాలు చెల్లిస్తున్నారే కాని పంచాయతీల నిర్వాహణకు మాత్రం నిధుల కేటా యింపు లేకుండా పోయింది. మూడు నెలలకు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ పైనాన్స నుంచి పంచాయతీలకు నిధులు రావలసి ఉంటుంది. 2024 మార్చిలో 15వ పైనాన్స నుంచి చిన్నపంచాయతీలకు రూ.80వేలు, మీడియా పంచాయతీలకు రూ.1.60 లక్షలు, మేజర్‌ పంచాయతీలకు రూ.1.70 లక్ష నిధులు విడుదలయ్యాయి. అప్పటి నుంచి పం చాయ తీలకు నిధులులేక మోటార్ల మరమ్మతులు, విద్యుత దీపాలు, ట్రాక్టర్‌ డిజిల్‌ కోసం కార్యదర్శులు పడరాని పాట్లు పడుతు న్నారు. కొద్ది వేతనాలతో పనిచేస్తున్న మేము అప్పులు చేసి గ్రామ పంచాయతీలను ఎందుకు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ప్రతాప్‌ నగర్‌లో రూ.9 లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనం, బృహత ప్రకృతి వనాల్లో మొక్కలు లేకపోవడం గమనార్హం.

మొక్కలు కాపాడాలి : గుర్రం సురేష్‌, డిండి

వనమహోత్సవంలో నాటిన మొక్కలు నీళ్లులేక ఎండుతున్నా యి. లక్షల రూపాయలు ఖర్చుచేసి నాటిన మొక్కలు సరైన పోషణలేక ఎండు తున్నా యి. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నిధు లు విడుదల చేయాలి. ట్యాంకర్ల ద్వారా ఈ వేసవి లో మొక్కలకు నీరుపోసి కాపాడాలి.

మొక్కలు కాపాడుతాం : వెంకన్న,ఎంపీడీవో, డిండిహరితహారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలను ఏవిధంగానైనా కాపాడుతాం. ఇప్పటికే పం చాయతీ కార్యదర్శులకు ట్యాంకర్ల ద్వారా నీరు పోయాలని సూచనలు చేశాం. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహమీ ద్వారా నగదు జమకూరుస్తాం.

Updated Date - Mar 29 , 2025 | 11:44 PM