మోడల్ కాలనీ ఇల్లు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:26 AM
మోడల్ కాలనీ ఇళ్లను వెంటనే పూర్తిచేయాలని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో మోడల్‌కాలనీని, ఆదివారం నిర్వహించే సీఎం రేవంతరెడ్డి సభకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : మోడల్ కాలనీ ఇళ్లను వెంటనే పూర్తిచేయాలని మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పట్టణంలో మోడల్‌కాలనీని, ఆదివారం నిర్వహించే సీఎం రేవంతరెడ్డి సభకు సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగాది పండుగ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తున్నందున పట్టణంలోని రాజీవ్‌గాంధీ ప్రాంగణంలో సభను నిర్వహిస్తున్నామన్నారు. దేశంలో ఇంతకన్నా గొప్ప సంక్షేమ పథకం లేదన్నారు. రాష్ట్రంలో అద్భుతమైన ఈ పథకాన్ని హుజూర్‌నగర్‌లో ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలుచేసి తీరుతుందన్నారు. దేశంలో ఈ పథకం ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. కొత్త రేషన్‌కార్డుదారులకు కూడా సన్నబియ్యం అందిస్తామన్నారు. మోడల్ కాలనీ ఇళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఉగాది రోజున పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలోనే మోడల్‌కాలనీ అతిపెద్దదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ తేజ్‌సనందలాల్ పవార్, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నర్సింహ, ఏఎస్పీ మేకా నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీవో శ్రీనివాసులు, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ నాగార్జునరెడ్డి, కమిషనర్ శ్రీనివా్‌సరెడ్డి, సీఐ చరమందరాజు పాల్గొన్నారు.