Share News

జీవాల మూగ రోదన

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:37 AM

మూగజీవాలకు వైద్యం అందక మూగరోదన అనుభవిస్తున్నాయి. పశు వైద్యశాలలో వైద్యులు లేకపోవడంతో వెతలు తప్పడం లేదు. వైద్యంపై అవగాహన లేని అటెండర్లు, గోపాల మిత్రలతో వైద్యం చేయిస్తున్నారు. దీంతో వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. (ఆంధ్రజ్యోతి- యాదగిరిగుట్ట రూరల్‌)

 జీవాల మూగ రోదన

మూగజీవాలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం పశువైద్యాశాలలు ఏర్పాటు చేసింది. వాటిపై మం డల, గ్రామస్థాయి పశువైద్య శాలలపై జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ కొరవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా తయా ర య్యాయి. జిల్లాలో భువనగిరి, రామన్నపేట, మో త్కూరు మండల, గ్రామీణ, సబ్‌సెంటర్లు కలిపి జిల్లా వ్యాప్తంగా 74 పశువైద్యశాలలు ఉన్నాయి. ప్రధానంగా (వీఏఎస్‌) వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ 30, వీఏ 30, జేవీవో 16, వీఏల్‌వో 5 వైద్యులు ఉండగా అటెండర్లు 61కి గాను 21 ఉండగా అందు లో 39 మంది ఖాళీలుగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మందులు రెండేళ్లుగా సరఫరా కాకపోవడంతో ప్రైవేట్‌ దుకాణాల ధరలతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఎలాంటి అర్హత లేని వ్యక్తులు ఇష్టానుసారంగా మందులు ఇస్తూ డబ్బులు దండుకోవడం తప్ప కాపా డుతున్న దాఖలాలు లేవు. గోపాలమిత్రలు పశువులు ఎదకు వచ్చినప్పుడు వ్యాక్సిన్‌ వేయాలే తప్పా ఎలాంటి వె ౖద్యం చేయొద్దని నిబంధనఉన్నప్పటికీ వారి ఇష్టం వచ్చినట్లు పశువులకు వైద్యం చేయిస్తున్నాని ఆరో పణలు వినిపి స్తున్నాయి. అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వార అత్యవసర మందులు జ్వరం, దగ్గు, రోగాలకు సంబంధించిన యాంటీబటిక్స్‌ నట్టల మం దులు ఇప్పటి వరకు రావడం లేదు. పశుగ్రాసం కోసం రెండేళ్లుగా జొన్నలు ఇవ్వడం లేదని సమాచారం. గతంలో ఏడాదికి మూడుసార్లు ఈ మందులు సరఫరాఅయ్యేవి. ప్రస్తుతం అవి పూ ర్తిగా రావడం లేదు. వైద్యాధికారులు వారు పని చేసే కార్యాలయం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. కానీ 70 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్‌, సమీప ప్రాంతాల నుంచి వచ్చి వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. సమయపాలన పాటించకుండా చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. పశువుల వైద్యం మొత్తం గోపాల మిత్రలు, సిబ్బందికి అప్ప గించి చేతులు దులుపుకుంటున్నట్లు సమా చారం. వారు అవగాహన లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యాక్సిన్‌ వేయడంతోమూగజీవాలు మృతి చెందుతున్నాయి.

నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

జిల్లా వ్యాప్తంగా పశువైద్యాధికారులు అంద రూ దవాఖానాల్లో అందుబాటులో ఉం టూ పశువులకు సేవలు అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తా. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు

-జానయ్య, జిల్లా పశువైద్యాధికారి

Updated Date - Mar 22 , 2025 | 12:37 AM