Share News

Special officers: ఇక ప్రత్యేక అధికారుల పాలన..

ABN , Publish Date - Jan 25 , 2025 | 07:07 AM

శివార్లలోని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాల్టీల(Municipal corporations and municipalities) పాలకమండలి గడువు శనివారంతో ముగియనుంది. గ్రేటర్‌ చుట్టుపక్కల ఉన్న ఏడు కార్పొరేషన్లు, 20 మునిసిపాల్టీలకు 2020 జనవరి 26న పాలకమండలి కొలువుదీరింది.

Special officers: ఇక ప్రత్యేక అధికారుల పాలన..

- నేడు ముగియనున్న కార్పొరేషన్లు, మునిసిపాల్టీల పాలకమండలి గడువు

హైదరాబాద్‌ సిటీ: శివార్లలోని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాల్టీల(Municipal corporations and municipalities) పాలకమండలి గడువు శనివారంతో ముగియనుంది. గ్రేటర్‌ చుట్టుపక్కల ఉన్న ఏడు కార్పొరేషన్లు, 20 మునిసిపాల్టీలకు 2020 జనవరి 26న పాలకమండలి కొలువుదీరింది. నేటితో పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. దీనికి సంబంధించి పురపాలక శాఖ ఉత్తర్వులు విడుదల చేస్తుందని ఓ అధికారి తెలిపారు. ఇప్పటికే ఉన్న కమిషనర్లను ప్రత్యేక అధికారులుగా కొనసాగిస్తారా..? ఇతరులకు బాధ్యతలు అప్పగిస్తారా..? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ధూలియా గేదె @ 4.50 లక్షలు


జీహెచ్‌ఎంసీ(GHMC)తోపాటు ఔటర్‌ వరకు ఉన్న ప్రాంతాలన్నింటిని కలుపుతూ కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసే అవకాశముందన్న ప్రచారం ఉంది. దీనికి సంబంధించి కసరత్తు ప్రారంభించారు. బల్దియా పాలకమండలి గడువు ఫిబ్రవరి 10, 2026 వరకు ఉన్న నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనుకుంటే మరో యేడాది తరువాతే కార్యరూపం దాల్చనుంది. నూతన కార్పొరేషన్ల ఏర్పాటుపై ప్రచారం జరుగుతోన్నా.. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.


ఈవార్తను కూడా చదవండి: మా కుమార్తెలా ఏ అమ్మాయీ మోసపోవొద్దు

ఈవార్తను కూడా చదవండి: మేడిగడ్డలో లోపాలను 2019లోనే గుర్తించాం

ఈవార్తను కూడా చదవండి: ఎవుసంపై కేసీఆర్‌ నజర్‌

ఈవార్తను కూడా చదవండి: Uttam: హరీశ్‌వి దగుల్బాజీ మాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 25 , 2025 | 07:07 AM