ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Mar 20 , 2025 | 11:47 PM
పట్టణంలోని రాష్ర్టీయ రహదారిపై వాహన ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. స్థానిక జాతీయ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను సందర్శించారు.

మందమర్రి టౌన్, మార్చి 20(ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని రాష్ర్టీయ రహదారిపై వాహన ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపారు. స్థానిక జాతీయ రహదారిలో ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను సందర్శించారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమా దాలు జరగవని, ఈ మద్య కాలంలో అతి వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల భారీన పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, రామగుండం సీపీతో పాటు బెల్లంపల్లి ఏసీపీ ఆదేశాల మేరకు రహదారి నిర్వాహకులు సీసీ కెమెరాలను అమర్చాలని కోరుతున్నామన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తిం చి అక్కడ నివారణకు సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, లైటింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, విద్యుత్ దీపాలు అమర్చాలని కోరుతున్నా మన్నారు. రహదారిపై రాత్రివేళలో పశువులు ఉండకుండా చర్యలు చేపట్ట నున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాకుండా రైతులు అర్దరాత్రి రోడ్లపై పశువులను వదిలితే వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మందమర్రి ఎస్సై రాజశేఖర్, రామకృష్ణాపూర్ ఎస్సై పాల్గొన్నారు.