Share News

Hyderabad: మంత్రి సీతక్కకు నిరసన సెగ..

ABN , Publish Date - Jan 23 , 2025 | 07:30 AM

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)కు నిరసన సెగ తగిలింది. బుధవారం మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో డంపింగ్‌ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం) యంత్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు.

Hyderabad: మంత్రి సీతక్కకు నిరసన సెగ..

హైదరాబాద్: పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka)కు నిరసన సెగ తగిలింది. బుధవారం మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో డంపింగ్‌ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ (ఎస్‌డబ్ల్యూఎం) యంత్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను స్థానికులు అడ్డుకున్నారు. డంపింగ్‌ యార్డును తొలగించాలంటూ ఎంతో కాలంగా తాము డిమాండ్‌ చేస్తుంటే.. ఇక్కడే మరో కొత్త యంత్రాన్ని ప్రారంభిస్తారా అంటూ ప్రశ్నించారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA Danam: సీఎం వచ్చే వరకు ఆపండి..


డంపింగ్‌ యార్డు కారణంగా తాము, తమ పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా స్థానిక బీజేపీ(BJP) నేతలు కూడా నిరసనకు దిగారు. మహిళలు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో మంత్రి వారితో మాట్లాడారు. డంపింగ్‌ యార్డు సమస్యను జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయినా ఆందోళనకారులు శాంతించకపోవడంతో మేడిపల్లి పోలీసులు చెదరగొట్టి అక్కడి నుంచి పంపించేశారు. స్థానికుల ఆందోళనల మధ్యనే మంత్రి సీతక్క ఐటీసీ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఎస్‌డబ్ల్యూఎం యంత్రాన్ని ప్రారంభించారు.


city3.jpg

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నివాస ప్రాంతాల నుంచి పోగవుతున్న ఘన వ్యర్థాలను అధునాతన పద్ధతుల్లో నిర్వీర్యం చేసి తిరిగి ఉపయోగించుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, స్థానిక మేయర్‌ అమర్‌సింగ్‌, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వజ్రేశ్‌యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Prakash Rao: రాజకీయాలు వద్దు.. వివరాలు చెప్పండి

ఈవార్తను కూడా చదవండి: మేం తలచుకుంటే కాంగ్రెసోళ్లు బయట తిరగలేరు

ఈవార్తను కూడా చదవండి: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

ఈవార్తను కూడా చదవండి: పోలీసుల పహారాలో గ్రామసభలా?

Read Latest Telangana News and National News

Updated Date - Jan 23 , 2025 | 07:30 AM