Raghunandan Rao: కేటీఆర్‌వి నంగనాచి కబుర్లు
ABN , Publish Date - Apr 04 , 2025 | 03:55 AM
పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాల మొహం చూడని బీఆర్‌ఎస్ యువరాజు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నాడంటూ ఆ పార్టీ నేత కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు.

ఎమ్మెల్యే రఘునందన్‌రావు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు విశ్వవిద్యాలయాల మొహం చూడని బీఆర్‌ఎస్ యువరాజు ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నాడంటూ ఆ పార్టీ నేత కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. హెచ్‌సీయూ భూములపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ పార్టీకే లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీల భూములు ఆక్రమించుకుని డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నించిన విషయం అందరికీ తెలుసని రఘునందన్ అన్నారు. బీఆర్‌ఎస్ నేతలు విద్యార్థుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. పార్టీలది వీణా-వాణిలా విడదీయరాని బంధమని అన్నారు. కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే విద్యార్థుల విజయమని స్పష్టం చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులను జుట్టు పట్టుకుని పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడంలేదని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అని నిత్యం చెప్పే రేవంత్‌రెడ్డి.. ఇందిరమ్మ హయాంలో ఇచ్చిన భూములను వ్యాపారం కోసం ఎలా వాడతారని ఎంపీ రఘునందన్ అడిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..
For More AP News and Telugu News