TG Budget: సామాజిక ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:56 AM
రాజీవ్ ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచాక.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తంలో వైద్య సేవలు పొందిన రోగులు 30 మంది మాత్రమే ఉన్నారు.

30 మందికే 10లక్షల ఆరోగ్యశ్రీ
రాజీవ్ ఆరోగ్యశ్రీ వ్యయ పరిమితిని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచాక.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తంలో వైద్య సేవలు పొందిన రోగులు 30 మంది మాత్రమే ఉన్నారు. రూ.5 లక్షల వరకు వినియోగించుకున్న వారు 170 కాగా.. రూ.50వేలకు పైబడిన సేవలను పొందిన వారు ఎక్కువగా ఉన్నారు. మొత్తానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన వారు 2.92 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కుటుంబ నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో 1,35,713 మంది కండోమ్‌లను వాడుతుండగా, 1,10,016 మంది ఓరల్ పిల్స్‌ను వినియోగిస్తున్నారు. మరో 13,676 మంది కుటుంబ నియంత్రణ ఇంజెక్షన్లు చేయించుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ స్ర్కీనింగ్‌లో 3.89 కోట్ల మందిని పరీక్షించగా, 56 లక్షల మంది రక్తపోటుతో.. 27 లక్షల మంది మఽధమేహంతో బాధపడుతున్నట్లు తేలింది.
ఏయే రంగాల్లో ఎంతమేర ఉపాధి?
తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ట్రేడ్ అండ్ ఆటోమొబైల్ రిపేర్ రంగంలో 18.7ు మంది ఉపాధి పొం దుతున్నారు. ఆ తర్వాతి స్థానాలను తయారీ రంగం (16.7ు), ఐటీసీ(11.1ు), నిర్మాణ రంగం(11ు), రవాణా- స్టోరేజీ రంగం(6.4ు), విద్య(6.1ు), వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాలు(4.3ు), స్వయం ఉపాధి(4.1ు), బీమా-ఆర్థిక రంగం(3.1ు), ఇతర విభాగాలు(14.4ు) ఉన్నాయి.
200 ఎకరాల భూమి.. 12 చెరువులను కాపాడిన హైడ్రా
200 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. హైదరాబాద్ నగరంలో 12 పెద్ద చెరువులను సంరక్షించి, ఆక్రమణలకు గురి కాకుండా వాటికి రక్షణ ఏర్పాట్లు చేసింది. విపత్తు ప్రతిస్పందన బృందాల(డీఆర్‌ఎఫ్) సంఖ్య 42 నుంచి 72కు పెరిగింది.
రాష్ట్రంలో 24.69% అడవులు.. దేశంలో 3వ స్థానం
తెలంగాణలో అటవీ విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 27,688 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అడవుల వాటా 24.69ు. ఛత్తీ్‌సగఢ్, ఒడిసా తర్వాత.. తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో ఉంది. జిల్లాల వారీగా చూస్తే.. రాష్ట్రంలో అత్యధికంగా ములుగులో 64ు అటవీ భూములున్నాయి. అత్యల్పంగా కరీంనగర్‌లో 2.29ు మేర అడవులున్నాయి.
ఏడు పులులు.. 41 చిరుతలు
ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్(ఏఐటీఈ)-2022 ప్రకారం రాష్ట్రంలో ఏడు పులులు, 41 చిరుత పులులున్నాయి. కవ్వాల్, అమ్రాబాద్ పులుల అభయారణ్యాల్లో వీటిని గుర్తించారు.
ఫోన్ల సంఖ్య 4.57 కోట్లు
తెలంగాణలో జనాభా కంటే సెల్ ఫోన్‌లు, ల్యాండ్ ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 4.42కోట్ల సెల్‌ఫోన్‌లు, 15.2 లక్షలు ల్యాండ్‌లైన్ ఫోన్లున్నాయి.
1.71 కోట్ల వాహనాలు
రాష్ట్రంలో మొత్తం 1.71కోట్ల వాహనాలున్నాయి. వీటిలో సింహభాగం వాటా(73.52ు) ద్విచక్ర వాహనాలదే. మిగతా కేటగిరీలో కార్లు, ఆటోరిక్షాలు, ఇతర మధ్యతరహా, భారీ, రవాణా వాహనాలున్నాయి.