Share News

Viral Video: నడిరోడ్డుపై మహిళ వింత ప్రవర్తన.. అందరూ చూస్తుండగా..

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:23 PM

అక్కడికి వచ్చిన ఆ మహిళ నడిరోడ్డులో కూర్చుంది. బ్యాగును పక్కన పడేసి వింతగా ప్రవర్తించటం మొదలెట్టింది. జనం మొత్తం ఏం జరుగుతోందో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయారు. ఏకంగా 20 నిమిషాల పాటు ఆమె వింతగా ప్రవర్తించింది.

Viral Video: నడిరోడ్డుపై మహిళ వింత ప్రవర్తన.. అందరూ చూస్తుండగా..
Viral Video

ఇంటర్ నెట్ వాడకం పెరిగిపోయిన తర్వాత జనాల ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదువ లేకుండా పోయింది. ఎక్కడో అమెరికాలోని పల్లెటూల్లో జరిగే సంఘటనను.. ఇక్కడ అమలాపురంలో కూర్చుని చూసేస్తున్నారు. జెట్ స్పీడులో సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. మరీ ముఖ్యంగా వీడియో కంటెంట్ ఇంటర్‌నెట్‌ను షేక్ చేసేస్తోంది. ప్రతీ రోజు ఏదో ఒక వింత సంఘటన వైరల్‌గా మారి, జనాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజాగా, ఓ మహిళకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూస్తున్న జనం ఆశ్చర్యంతో పాటు షాక్ కూడా అవుతున్నారు. రోడ్డుపై కూర్చున్న ఆ మహిళ అందరినీ ఆశ్చర్యపరిచేలా చాలా వింతగా ప్రవర్తించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో.. లోహియా అనే హాస్పిటల్ ఉంది. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఓ మహిళ హాస్పిటల్‌ముందున్న రోడ్డుపై కూర్చుంది. నడిరోడ్డుపై కూర్చుని వింతగా ప్రవర్తించటం మొదలెట్టింది. తలను గిరగిరా తిప్పుతూ ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 నిమిషాల పాటు అలా తల తిప్పుతూనే ఉంది. కొన్నిసార్లు చేతుల్ని కూడా తిప్పుతూ ఉంది. ఆ మహిళ రోడ్డు మీద కూర్చుండిపోవటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు పక్కన వెళుతున్న జనం పెద్ద ఎత్తున పోగయ్యారు. ఆమె ఎందుకలా చేస్తోందో తెలీక అక్కడున్న జనమంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చాలా కష్టపడి ఆమెను పక్కకు తీసుకువచ్చారు.


ఆమె అడ్రస్ కనుక్కునే పడ్డారు. ఇక, ఓ వ్యక్తి ఆ మహిళ వింత ప్రవర్తనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ ఆమె ఏదైనా మానసిక రోగంతో బాధపడుతూ ఉన్నట్లు ఉంది’.. ‘ పాపం.. ఇలాంటి వారిని చూస్తే జాలేస్తుంది’..‘ ఆమె మానసికస్థితి బాలేదు. వెంటనే డాక్టర్‌కు చూపించండి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్
Keerthi Suresh : ఐస్‌క్రీం అమ్మే వ్యక్తిని అల్లాడించిన మహానటి.. ఫన్నీ వీడియో వైరల్..
Optical Illusion Puzzle: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ కుందేళ్ల మధ్యలో క్యారెట్ ఎక్కడుందో చెప్పండి

Updated Date - Mar 21 , 2025 | 04:25 PM