Share News

Rains in AP: ప్రజలకు కూల్ న్యూస్

ABN , Publish Date - Mar 21 , 2025 | 04:25 PM

Rains in AP: వేసవి కాలం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ రాష్ట్రంలో ఎండలు మాత్రం ఠారెత్తిస్తున్నాయి. అలాంటి వేళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. దీంతో వాతావరణం కొద్దిగా చల్లబడే అవకాశం ఉంది. అలాగే ప్రజలు సైతం వేడి తీవ్రతతోపాటు వడగాలుల నుంచి కాస్తా ఉపశమనం పొందే అవకాశం ఉంది.

Rains in AP: ప్రజలకు కూల్ న్యూస్
AP Weather Updates

విశాఖపట్నం, మార్చి 23: వేసవి కాలం ఇంకా ప్రారంభం కాలేదు. అప్పుడు ఎండలు దంచి కొడుతోన్నాయి. అలాంటి వేళ.. ఏపీ ప్రజలకు విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూల్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తేలకపాటి వర్షాలు కురుస్తాయని శుక్రవారం వెల్లడించింది. రేపు అంటే.. శనివారం ఈ వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మూడు రోజుల అనంతరం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని పేర్కొంది. ఇప్పడే ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు పడిన తర్వాత ఎండల మరింత తీవ్రం అవుతాయనే ఓ విధమైన ఆందోళన ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతోంది.


మరోవైపు ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీన పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వాతావరణం మారనుంది. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.

Rains.jpg


ఇంకోవైపు తెలంగాణలో సైతం వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మార్చి 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించింది. ఇక వర్షాల కారణంగా.. వేడి తీవ్రతే కాదు.. వడగాలులు సైతం తగ్గుతాయి. దీంతో రెండు రోజుల పాటు ప్రజలకు వడగాలుల నుంచి ఉపశమనం పొందనున్నారు.

ఇవి కూడా చదవండి...

10th Class Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభం.. ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు

Vamsi Bail Petition: వంశీ.. మరో ఐదు రోజులు ఆగాల్సిందే

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 05:00 PM