Share News

సన్నబియ్యం పండుగ...

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:34 PM

ఉగాది కా నుకగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాపుల నుంచి లబ్దిదా రులకు సన్నబియ్యం పంపిణీకి సన్నహాలు చేస్తోంది. కార్డు కలిగిన లబ్దిదారుల కుటుంబంలోని ఒక్కొక్క రికి ఆరుకిలోల చొప్పున సన్నబియ్యం పోసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చౌకధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు కూడ చేరింది.

సన్నబియ్యం పండుగ...

ఏర్పాట్లలో పౌరసరఫరా శాఖ అధికారులు

ఇప్పటికే రేషన్‌ దుకాణాలకు చేరిన స్టాక్‌

ప్రస్తుతం పాత కార్డు దారులకే సరఫరా

ఇంకా పరిశీలన దశలోనే కొత్త ఆర్జీలు

ఆందోళనలో కొత్తరేషన్‌కార్డు దారులు

నేటి నుంచి లబ్ధిదారులకు పంపిణీకి సన్నాహాలు

మంచిర్యాల, మార్చి31(ఆంధ్రజ్యోతి): ఉగాది కా నుకగా రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాపుల నుంచి లబ్దిదా రులకు సన్నబియ్యం పంపిణీకి సన్నహాలు చేస్తోంది. కార్డు కలిగిన లబ్దిదారుల కుటుంబంలోని ఒక్కొక్క రికి ఆరుకిలోల చొప్పున సన్నబియ్యం పోసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే చౌకధరల దుకాణాలకు సన్నబియ్యం స్టాకు కూడ చేరింది. ఏప్రిల్‌ 1 నుంచి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతుం డగా రేషన్‌డీలర్ల బయోమెట్రిక్‌ కొంత మేర పెండిం గ్‌లో ఉంది. అది పూర్తయితే ప్రభుత్వం ప్రకటించిన విధంగా 1వ తేదీ నుంచి లబ్దిదారులకు సన్నబియ్యం అందనున్నాయి. బయోమెట్రిక్‌ పూర్తిగాని పక్షంలో ఒకటి రెండు రోజులు ఆలస్యంగా రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.

పేదలకు చేకూరనున ్న లబ్ధి...

రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ ద్వారా లబ్ది దారులైన పేదలకు సన్నబియ్యం లబ్ది చేకూరనుం ది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు హర్షం వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు షాపుల ద్వారా పం పిణీ అవుతున్న దొడ్డు బియ్యం అనేక మంది తిన కుండా మార్కెట్‌లో సన్నబియ్యం కొనుగోలు చేసి వి నియోగిస్తున్నారు. సన్నబియ్యం ధర క్వింటాకు రూ. 5వేల నుంచి రూ.6వేల వరకు పలుకుతుం డడంతో తలకు మించిన భారమే అయినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత సీజన్‌లో రూ.500 బోనస్‌ వెచ్చించి సన్నరకం ధాన్యం కొనుగోలు చేసింది. గతంలో కాకుండా 37 శాతం బ్యాంక్‌ గ్యారంటీతో మిల్లర్లకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) కోసం అప్పగించింది. సకా లంలో సన్నబియ్యం చేతికందడంతో ప్రభుత్వం చౌక ధరలకు ఇవ్వడం ద్వారా లబ్దిదారులకు పంపిణీకి సి ద్ధమవుతుంది. ఈనేపథ్యంలో సన్నబియ్యం సరఫరా చేస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు ఆర్థికభారం తగ్గినట్లవుతుంది.

దొడ్డు బియ్యం పక్కదారి...

ఇప్పటి దాక రేషన్‌షాపుల్లో ఒక్కొక్కరికి ఆరు కి లోల చొప్పున దొడ్డు బియ్యాన్ని ఇస్తుండగా వారు వాటిని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ బియ్యా న్ని కిలో రూ. 10 నుంచి రూ.15 చొప్పున బయట వి క్రయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్‌డీలర్లే బి య్యానికి బదులు లబ్దిదారుల బయోమెట్రిక్‌ తీసు కొని నగదు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చి నట్లు తెలుస్తోంది.

పాతకార్డుదారులకే పంపిణీ...

ఉగాది కానుకగా తెల్లకార్డు దారులకు ప్రభుత్వం అందించే సన్నబియ్య ప్రస్తుతానికి పాతకార్డుదారుల కే అందనున్నాయి. కొత్త రేషన్‌కార్డు దరఖాస్తుదారు లకు సన్నరకం ఇప్పట్లో అందే అవకాశాలు లేవు. కొ త్త రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారు మరి కొంత సమయం వేచి చూడక తప్పని పరిస్థితులు ఉన్నాయి. రేషన్‌కార్డు చేతికి అందితే తప్ప బియ్యం పొందే అవకాశం లేదు. దీంతో దరఖాస్తుదారులు ని రాశకు గురవుతున్నారు. నూతన రేషన్‌కార్డుల జారీ లో మార్పులు చేర్పులు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రక టించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క కార్డుల పం పిణీ చేయలేదు. సన్నబియ్యం పొందడంతో పాటు రాజీవ్‌ యువ వికాసం కింద వివిధ కార్పొరేషన్‌ రు ణాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్న రేషన్‌కార్డు త ప్పనిసరి. నూతన రేషన్‌కార్డులు జారీకాకపోవడం తో అర్హులైన పలువురు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కావాల్సిన పరిస్థితి నెలకొంది.

పరిశీలన దశలోనే దరఖాస్తులు...

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్ర మాల్లో తెల్లరేషన్‌ కార్డు కోసం నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. అదే విధంగా పాతకార్డుదారులు కూ డ కుటుంబంలోని సభ్యుల చేరిక, మార్పులు, చేర్పు ల విషయంలో కూడ దరఖాస్తు పెట్టుకున్నారు. మం డలాలు, గ్రామాలు వార్డుల వారిగా ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు సేక రించారు. అయితే నెలలు గడిచిన ఈ దరఖాస్తుల పరిశీలన ఇంకా పూర్తికాలేదు. సేకరించిన దరఖాస్తు లను అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అ ర్హులను తేల్చాల్సి ఉంది. అయితే విచారణ జరపా ల్సిన సంబంధితశాఖల అధికారయంత్రాంగం నిర్ల క్ష్యం కారణంగా కార్డుల పరిశీలన జరగడం లేదు. ప రిశీలన జరిపి అర్హులుగా తేల్చిన జాబితాను జిల్లా పౌరసరఫరాల శాఖకు అందిస్తే కొత్తగా పెరిగిన కా ర్డులు ఆ మేరకు సభ్యుల లెక్కచొప్పున సన్నబియ్యం డిమాండ్‌ను ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉం డేది. పరిశీలన పూర్తికాకపోవడంతో ప్రభుత్వం నుం చి గ్రీన్‌సిగ్నల్‌ రాక కొత్తకార్డుల జారీ ప్రక్రియ ప్రా రంభం కాలేదు. దరఖాస్తుల పరిశీలన ఎప్పటికీ పూర్తవుతుందనే దానిపై కూడ ఇంకా స్పష్టత లేదు.

జిల్లాలో 423షాపుల ద్వారా బియ్యం పంపిణీ...

మంచిర్యాల జిల్లాలో 423 షాపుల ద్వారా లబ్ధిదా రులకు రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతుంది. జిల్లా లో మొత్తం 2,19,106 తెల్ల రేషన్‌కార్డులు ఉండగా సుమారు 7వేలపై చిలుకు మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతాయి. సన్నబియ్యం కోటా కింద జిల్లా వ్యాప్తంగా అన్ని షాపులకు ఇప్పటి వరకు 4143.692 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా జరిగింది. సన్నబి య్యం పంపిణీ ప్రారంభించిన రెండు మూడు రోజు ల్లో పూర్తికోటా షాపులకు చేరే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 31 , 2025 | 11:34 PM