Share News

ధాన్యం పరిశ్రమలకు ప్రత్యేక విద్యుత్‌లైన్లు

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:25 AM

ధాన్యం పరిశ్రమలకు నాణ్య మైన విద్యుత్‌ అందించేందుకు అదనపు ఫీడర్ల నుంచి ప్రత్యేక విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు.

ధాన్యం పరిశ్రమలకు ప్రత్యేక విద్యుత్‌లైన్లు
మిల్లర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బీఎల్‌ఆర్‌

మిర్యాలగూడ అర్బన్‌, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ధాన్యం పరిశ్రమలకు నాణ్య మైన విద్యుత్‌ అందించేందుకు అదనపు ఫీడర్ల నుంచి ప్రత్యేక విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తెలిపారు. మిల్లర్స్‌ భవనంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో టీజీఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజనీర్‌ భిక్షపతితో కలిసి పాల్గొన్నారు. ఆసియా ఖండంలోనే రైస్‌ ఇండ్రస్ట్రీస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గంలో పరిశ్రమలకు ప్రత్యేక విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయాలన్న అంశాలపై అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు. ప్రభుత్వం చర్చించి సానుకూలంగా స్పందించి ప్రత్యేక విద్యుత్‌ లైన్ల ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందన్నారు. డిమాండ్‌ తగిన విధంగా సరఫరాలో ఏర్పడుతున్న అవాంతరాలను నియంత్రించే సదుద్ధేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద న్నారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, గృహవిద్యుత్‌ వినియోగంలో ఏర్పడే విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు విద్యుత్‌లైన్లను విభజించి విద్యుత్‌ సరఫరాలో మరింతనాణ్యత పెంచుతామన్నారు. అందుకు అవసరమైన అంచనా వ్యయంతో కూడిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరెంటు సమస్య తలెత్తలేదని, రైతులు, ప్రజలు రోడ్డెక్కిన దాఖలాలు ఏమాత్రం లేవన్నారు. రాబోయే రోజుల్లో మెరుగైన సేవలందించేందుకు అధికారులు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని, తలెత్తిన సమస్యను సత్వరమే పరిష్కరించే విధంగా ఆయా కమిటీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ అవసరాలకోసం నిత్యం వేలాదిమంది ప్రజలు పరిసర గ్రామాలనుంచి పట్టణానికి వస్తుంటారని, దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ సమస్య తలెత్తుంతుంద న్నారు. పరిష్కరించేందుకు రోడ్లకు ఇరువైపుల వ్యాపార లావాదేవీలు కొన సాగించే చిరువ్యాపారుల కోసం హనుమాన్‌పేట ఫ్లై ఓవర్‌ వంతెన దిగువన అన్ని సదుపాయాలతో మార్కెట్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో మిల్ల ర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రప్రతినిధులు కర్నాటి రమేష్‌, బండారు కుశలయ్య, మిర్యా లగూడ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్‌, గంటా సంతోష్‌రెడ్డి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాసచారి, ఏడీఈలు రవీందర్‌రెడ్డి, రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:25 AM

News Hub