Share News

శివకేశవులకు విశేష పూజలు

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:44 AM

యాదగిరిగుట్ట కొండపై ఉన్న శివాలయంలో శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి.

శివకేశవులకు విశేష పూజలు
శివాలయంలో పూజలు జరుపుతున్న అర్చకులు

యాదగిరీశుడి సేవలో త్రిపుర హైకోర్టు జడ్జి

యాదగిరిగుట్ట, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట కొండపై ఉన్న శివాలయంలో శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. స్వయంభులైన లక్ష్మీనృసింహులకు శ్రీవైష్ణవ పాంచరాత్రాగమరీతిలో, శ్రీ పర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామివారి శివాలయంలో స్ఫటికమూర్తులకు శైవాగమశాస్త్రరీతిలో నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సోమవారం ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.18,61,839ఆదాయం సమకూరినట్లు ఈవో ఏ.భాస్కర్‌రావు తెలిపారు. లక్ష్మీనృసింహుడిని త్రిపుర రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ఏ. భాస్కర్‌రావు లడ్డు ప్రసాదాలను అందజేశారు.

Updated Date - Mar 25 , 2025 | 12:44 AM