బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం
ABN , Publish Date - Mar 22 , 2025 | 11:38 PM
బీసీ ల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని, దీని కో సం బీసీలంతా ఒక్కతాటిపైకి రావాలని బీసీ ఆజా ది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూ దన్ తెలిపారు.

మందమర్రిటౌన్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): బీసీ ల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధ్యమని, దీని కో సం బీసీలంతా ఒక్కతాటిపైకి రావాలని బీసీ ఆజా ది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూ దన్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లా డుతూ గ్రామ గ్రామాన సంస్థగత నిర్మాణం చేసి బీసీలకు ఉద్యమ పోరాటం బలోపేతం చేస్తామని తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం 60శాతంగా ఉ న్న బీసీలకు రాజ్యాధికారం రాకుండా అణిచి వేస్తు న్నారని తెలిపారు. ఆయా పార్టీల్లో పని చేస్తున్న బీ సీలందరూ రానున్న రోజుల్లో రాజ కీయ పదవుల కోసం తప్పనిసరిగా కదం తొక్కాలన్నారు. బీసీ ఆజా ది ఫెడరేషన్ బలోపేతంలో భాగంగా కమిటీ లు వేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి సాగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ చార్జి లక్ష్మన్‌రావు, గజవెల్లి మనోహ ర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చిలు కమర్రి శ్రీనివాస్, జిల్లా అధ్య క్షుడు భాస్కర్ పాల్గొన్నారు.
ఫబీసీ ఆజాది ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా మందమర్రికి చెందిన కుడికాల భాస్కర్ నియమి తులయ్యారు. ఈ మేరకు ఆయనను నియ మిస్తూ శనివారం బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి మధుసూదన్ నియామకపత్రం అందజేశారు.