Share News

TANA: జూలై 3 నుంచి తానా మహాసభలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:15 AM

అమెరికాలోని మిచిగాన్‌ (నోవై)లో జరిగే ఈ మహాసభలకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) వేమూరి రాధాకృష్ణకు ఆహ్వానం అందింది. తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నాదెళ్ల గంగాధర్‌, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, చందు గొర్రెపాటి,

TANA: జూలై 3 నుంచి తానా మహాసభలు

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ప్రత్యేక ఆహ్వానం

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి. అమెరికాలోని మిచిగాన్‌ (నోవై)లో జరిగే ఈ మహాసభలకు ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) వేమూరి రాధాకృష్ణకు ఆహ్వానం అందింది. తానా కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ నాదెళ్ల గంగాధర్‌, మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి, డైరెక్టర్‌ సునీల్‌ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి బృందం వేమూరి రాధాకృష్ణను శనివారం స్వయంగా కలిసి మహాసభలకు ఆహ్వానించింది. అమెరికా, తెలుగు రాష్ట్రాల్లో తానా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను తానా ప్రతినిధులు వేమూరి రాధాకృష్ణకు ఈ సందర్భంగా వివరించారు. 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో భాగంగా బిజినెస్‌ సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు కళాకారులు, రచయితలు, వ్యాపారవేత్తలు వివిధ రంగాలకు చెందిన 10వేల మంది ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొంటారన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 04:16 AM