Share News

Phone Recovery: చోరీకి గురైన 70 వేల ఫోన్ల రికవరీ

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:03 AM

చోరీకి గురైన మొబైల్‌ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని సీఐడీ డీజీ షికాగోయల్‌ తెలిపారు.

Phone Recovery: చోరీకి గురైన 70 వేల ఫోన్ల రికవరీ

  • రికవరీలో తెలంగాణ రెండో స్థానం: సీఐడీ డీజీ

చోరీకి గురైన మొబైల్‌ ఫోన్ల రికవరీలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని సీఐడీ డీజీ షికాగోయల్‌ తెలిపారు. రోజుకు 98.67 శాతం చొప్పున ఏడాది కాలంగా 70,058 ఫోన్లను రికవరీ చేయగలిగామని ఆమె చెప్పారు. కేంద్రం ఏర్పాటు చేసిన సెంట్రల్‌ ఎక్వి్‌పమెంట్‌ ఐడెండిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) ద్వారా తెలంగాణ పోలీసులు ఫోన్లు రికవరీ చేశారని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు పోలీసుస్టేషన్‌ వరకు రావాల్సిన అవసరం లేదని, టీజీ పోలీసు సిటిజన్‌ పోర్టల్‌ ద్వారా తమ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చని ఆమె వివరించారు.

Updated Date - Mar 30 , 2025 | 02:03 AM