Share News

Hydro Power Plants: హిమాచల్‌ప్రదేశ్‌లో తెలంగాణ జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రాలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:38 AM

హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు చోట్ల 520 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాలను తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ జెన్‌కో నిర్మించనుంది. నామినేషన్‌ విధానంలో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.

Hydro Power Plants: హిమాచల్‌ప్రదేశ్‌లో తెలంగాణ జెన్‌కో జలవిద్యుత్‌ కేంద్రాలు

  • 520 మెగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటు

  • 40ఏళ్ల పాటు హిమాచల్‌కు 12-40ుఉచిత విద్యుత్‌

  • ఆ తర్వాత హిమాచల్‌కు యాజమాన్యపు హక్కులు

  • హిమాచల్‌, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఒప్పందం

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): హిమాచల్‌ప్రదేశ్‌లో రెండు చోట్ల 520 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాలను తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ జెన్‌కో నిర్మించనుంది. నామినేషన్‌ విధానంలో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. విద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి 100ు మూలధన పెట్టుబడులను జెన్‌కో భరించనుంది. శనివారం హిమాచల్‌ప్రదేశ్‌ రాజధాని సిమ్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో రెండు రాష్ట్రాల అధికారులు ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ)పై సంతకాలు చేశారు.


ఒప్పందంలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో సెలీ ప్రాంతంలో 400 మెగావాట్లు, మియార్‌లో 120 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. స్థలంతో పాటు సహకారాన్ని అందించినందుకుగాను 40 ఏళ్ల పాటు హిమాచల్‌ప్రదేశ్‌కు 12-40 శాతం మధ్య విద్యుత్‌ను తెలంగాణ ఉచితంగా సరఫరా చేయనుంది. 40 ఏళ్ల ఒప్పంద గడువు ముగిసిన తర్వాత రెండు విద్యుత్‌ కేంద్రాలపై హిమాచల్‌ప్రదేశ్‌కు యాజమాన్య హక్కుల పూర్తి స్థాయిలో బదిలీ కానున్నాయి. విద్యుత్‌ భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:38 AM