Viral Video: ముసలామే కానీ, మహా ముదురు.. నడిరోడ్డు మీద అమ్మాయిపై ఎలా దాడి చేసిందో చూడండి..
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:44 PM
మన దేశంలో కుర్రాళ్ల ముందు వయసు మళ్లిన వారు గొడవలో నిలబడలేరు. అయితే ఈ వీడియోలో మాత్రం ఇద్దరు వృద్ధులు.. కుర్రాళ్లను ఉతికి ఆరేశారు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

సాధారణంగా రోడ్ల మీద గొడవలు, వాహనాల నుంచి కిందకు దిగి కొట్టుకోవడాలు మన దేశంలోనే జరుగుతాయని అనుకుంటాం. అయితే అమెరికా వంటి దేశాల్లో కూడా అలాంటి గొడవలు సర్వ సాధారణమని ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే మన దేశంలో కుర్రాళ్ల ముందు వయసు మళ్లిన వారు గొడవలో నిలబడలేరు. అయితే ఈ వీడియోలో మాత్రం ఇద్దరు వృద్ధులు (Old).. కుర్రాళ్లను ఉతికి ఆరేశారు. ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
@WorldDarkWeb2 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో (Viral Video) షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వాహనాలు వేగంగా వెళ్తున్న ఓ రోడ్డు మీద రెండు కార్లు ఆగి ఉన్నాయి. ముందు కార్‌లో యువ జంట, వెనుక కార్‌లో వృద్ధ జంట ఉన్నాయి. కార్ కాస్త తగలడంతో ముందున్న యువ జంటకు కోపం వచ్చింది. వృద్ధ జంటపై దాడికి దిగింది. అయితే ఆ వృద్ధులు ఊరుకోలేదు. ముఖ్యంగా వృద్ధురాలు.. అమ్మాయిని చితక్కొట్టింది. రోడ్డు మీద పడేసి తన్నింది. పంచ్‌లు కురిపించింది. మరోవైపు వృద్ధుడు కార్ నుంచి ఐరన్ రాడ్ తీసి కుర్రాడిని పరిగెత్తించాడు.
ఆ ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 4.3 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 8.2 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ఆ వృద్ధుల గతం గురించి తెలియక తొందరపడ్డారేమో అని ఒకరు కామెంట్ చేశారు. ఆ వృద్ధులు చాలా దూకుడుగా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion Puzzle: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ కుందేళ్ల మధ్యలో క్యారెట్ ఎక్కడుందో చెప్పండి
IQ Puzzle: మీరు నిజంగా జీనియస్ అయితే.. ఈ ట్యాంకుల్లో ముందుగా ఏది నిండుతుందో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..