గుప్పుమంటున్న గుడుంబా...
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:39 PM
రాష్ట్రంలో నిషేద జాబితాలో గుడుంబా మళ్లీ నివురుగక్కు తుం ది. కొంతకాలం పాటు జిల్లాలో పూర్తిగా నిషేధంలో ఉన్నప్పటికీ రెండేళ్లుగా విపరీతంగా స్థావరాలు ఏర్ప డ్డాయి. ముఖ్యంగా మారుమూల మండలాల్లోని గ్రా మీణ ప్రాంతాల పరిధిలో పెద్ద మొత్తంలో గుడుం బా తయారవుతున్నట్లు తెలుస్తోంది.

పల్లెల్లో పెరుగుతున్న స్థావరాలు
దాడులు జరుగుతున్నా ఆగని తయారీ
జిల్లా వ్యాప్తంగా 195 కేసులు నమోదు
మంచిర్యాల, మార్చి28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిషేద జాబితాలో గుడుంబా మళ్లీ నివురుగక్కు తుం ది. కొంతకాలం పాటు జిల్లాలో పూర్తిగా నిషేధంలో ఉన్నప్పటికీ రెండేళ్లుగా విపరీతంగా స్థావరాలు ఏర్ప డ్డాయి. ముఖ్యంగా మారుమూల మండలాల్లోని గ్రా మీణ ప్రాంతాల పరిధిలో పెద్ద మొత్తంలో గుడుం బా తయారవుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా దాడు లు జరుగుతున్న జంకని ఉత్పత్తిదారులు అధి కారు లు కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా తమ పనిని కానిస్తున్నారు. జిల్లాలోని మంచిర్యాల, లక్షెట్టిపేట, చె న్నూర్, బెల్లంపల్లి ఎక్సయిజ్ స్టేషన్ల పరిధిలో దా దాపు నిత్యం గుడుంబా పట్టుబడుతున్న కేసులు నమోదవుతున్నాయి.
ఏరులైపారుతున్న గుడుంబా...
బెల్లంపల్లి పానకం, స్పటికతో కూడిన గుడుంబా జిల్లాలో ఏరులై పారుతోంది. కోటపల్లి, మందమర్రి, జన్నారం, వేమనపల్లి, నెన్నెల, తదితర మండలాల పరిధిలో వందల సంఖ్యలో స్థావరాలు ఉన్నట్లు ఎక్స యిజ్‌శాఖ అదికారులు గుర్తించారు. స్థావరాలపై మూకుమ్మడి దాడులు జరుపుతు పెద్దమొత్తంలో గు డుంబాను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇటీవల గు డుంబా స్థావరాలపై జరుగుతున్న దాడుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. జిల్లా కేంద్రంలోని పలు హో ల్‌సేల్ దుకాణాల్లో గంపగుత్తగా బెల్లం, స్పటిక కొను గోలు చేస్తూ తరలిస్తున్నారు. అనంతరం మారు మూల ప్రాంతాల్లో ప్రత్యేక బట్టీలు ఏర్పాటు చేసి గుడుంబా తయారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆయా గ్రామాల్లోని కొందరు గుడుంబా తయారీనే ప్రధాన వృత్తిగా పెట్టుకున్నట్లు సమాచారం. అలా తయారీ చేసిన గుడుంబాను ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా గమ్యాలకు చేరుస్తున్నారు.
జిల్లాలో 195 కేసులు నమోదు...
జిల్లాలోని నాలుగు ఎక్సయిజ్ స్టేషన్ల పరిధిలో జనవరి 1 నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఏకంగా 195 కేసులు నమోదుకావడం గమనార్హం. గుడుంబా తయారు చేసి విక్రయాలు జరుపుతున్న 205 మం దిని ఈ సందర్భంగా ఎక్సయిజ్ అదికారులు పట్టుకొ ని వారిపై కేసులో నమోదు చేశారు. జిల్లాలోని వి విధ స్థావరాల వద్ద..తయారు చేస్తున్న 772 లీటర్ల గుడుంబా, 1510 లీటర్ల బెల్లం పానకం, 65లీటర్ల స్పటిక ద్రావణంతో పాటు 23 వాహనాలను ఎక్సయి జ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయా స్థా వరాల్లో పెద్ద ఎత్తున గుడుంబా తయారీ చేస్తున్నా రనే సమాచారం మేరకు ఎక్సయిజ్ అధికారులు తరు చుగా దాడులు జరుపుతున్న గుడుంబా తయారీ ఆగకపోవడం గమనర్హం.
గుడుంబా తయారు చేయడం నేరం...
ఎక్సయిజ్ సూపరింటెండెంట్ నందగోపాల్
నిషేధిత గుడుంబాను తయారు చేయడం, విక్ర యించడం చట్టరీత్య నేరం. ప్రత్యేక స్థావరాలు ఏర్పా టు చేసి గుడుంబా తయారీ చేస్తున్నవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షింబోం. గుడుంబా స్థావరాలపై ఇప్పటికే పర్యవేక్షణ పెంచడం జరిగింది. గుడుం బా ను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపడు తున్నాం.