Share News

సమాజంలో దివ్యాంగులను గౌరవించాలి

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:43 PM

ప్రతీ వ్యక్తి సమా జంలో దివ్యాంగులతో ప్రేమగా ఉండి అన్ని రకాలుగా సహాయం అందించాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ ముఖ్య సలహాదారు శ్రీరామ్‌ఆర్య అన్నారు.

సమాజంలో దివ్యాంగులను గౌరవించాలి
మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ చీఫ్‌ అడ్వయిజర్‌ శ్రీరామ్‌ ఆర్య

తిమ్మాజిపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ వ్యక్తి సమా జంలో దివ్యాంగులతో ప్రేమగా ఉండి అన్ని రకాలుగా సహాయం అందించాలని జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ ముఖ్య సలహాదారు శ్రీరామ్‌ఆర్య అన్నారు. హైకోర్టు ఆ దేశానుసారం జిల్లా న్యాయసేవాధి కార సంస్థ నాగర్‌కర్నూల్‌ ఆధ్వ ర్యంలో గురువారం తిమ్మాజిపేట మండలం కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఆవరణలో నిర్వ హించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. చెవిటి, మూగ మానసిక అంగ దివ్యాంగ విద్యార్థులకు అవసరమయ్యే చట్టాలపై అవగాహన కల్పించారు. ఇతర వ్యక్తు లతో సమానంగా రక్షణ ఉంటుందని ఓటు హక్కు ఉందని సమస్యలు పరిష్కరించడం కోవడం కోసం సలహాలు, సూచనలు పొందడా నికి టోల్‌ ఫ్రీ నెంబరు 15100కు ఫోన్‌ చేసి న్యాయ సహాయం పొందాలని వికలాంగులకు సూచించారు. ఈ సమావేశంలో మండల విద్యా శాఖ అధికారి సత్యనారాయణశెట్టి, ఉపాధ్యా యులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 10:43 PM