రైతుల ప్రయోజనం కోసమే టస్సర్ రేషం కృషి మేళా
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:27 PM
రైతుల ప్రయోజనం కోసం ఉద్యానవన, పట్టుపరిశ్రమ శా ఖ ఆధ్వర్యంలో రాంచీలోని సీఎస్‌బీ-సీటీఆర్‌టీఐ స హకారంతో టస్సర్ రేషం కృషి మేళా నిర్వహిం చి నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.

- కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూరు, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : రైతుల ప్రయోజనం కోసం ఉద్యానవన, పట్టుపరిశ్రమ శా ఖ ఆధ్వర్యంలో రాంచీలోని సీఎస్‌బీ-సీటీఆర్‌టీఐ స హకారంతో టస్సర్ రేషం కృషి మేళా నిర్వహిం చి నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. మం గళవారం చెన్నూరు మండల కేంద్రంలోని దసలి పట్టుగూళ్ల నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభిం చారు. అనంతరం మోడల్ కొకూన్ మార్కెట్ కాం ప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జార్ఖండ్ లోని రాంచీలో గల సీటీఆర్ అండ్ టీఐ సంచాలకు లు డాక్టర్ బాలాజీ చౌదరి, ఛత్తీస్‌గఢ్‌లోని బిలా స్‌పూర్‌లో గల బీటీఎస్‌ఎస్‌వో సంచాకులు సెల్వకు మార్, జిల్లా ఉద్యానవన పట్టు శాక సంయుక్త సంచాలకులు లత, వరంగల్ జిల్లా సంయుక్త సం చాలకులు అనసూయలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ప్ర యోజనం కోసం రూ. 40 లక్షల అంచనా వ్యయం తో డీఎంఎఫ్‌టీ నిధుల కింద పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో దసళి పట్టుగూళ్ల నిల్వ భవనం (గిడ్డంగి)ని ప్రారంభించామన్నారు. రైతు శ్రేయస్సు లో భాగంగా టాసర్ రేషం కృషి మేళా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. టాసర్ పట్టు సాధ న చేసే రైతులను ప్రోత్సహిస్తూ పట్టు నూలు త యారీ, ఫ్యాబ్రిక్ తయారీ అభివృద్ధి చేయాలని, త ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలను సృ ష్టించవచ్చని తెలిపారు. దేశంలో టాసర్ ముడి పట్టు ఉత్పత్తిలో గత దశాబ్ద కాలంగా సైంటిస్టు డీ ఎవీకే భగవానులు నేతృత్వంలో బీఎస్‌ఎంటీసీ చె న్నూరు అత్యుత్తమ సేవలను అందిస్తున్నారని తెలి పారు. అనంతరం టాసర్ సిల్క్ రీలింగ్ యంత్రా లతో పాటు ప్రత్యక్షంగా యంత్ర పనితీరును ప్ర దర్శించారు. అనంతరం కోకన్ ఉత్పత్తి, టాసర్ గు డ్డు ఉత్పత్తిలో ఉత్తమ రైతులతో పాటు అధికారు లు త్వరలో పదవీ విరమణ పొందనున్న సెంట్ర ల్ సిల్క్ బోర్డు చెన్నూరు భగవానులును ఘనం గా సన్మానించి ధృవపత్రాలు, జ్ఞాపికలు అందజే శారు. ఈ కార్యక్రమంలో సెరి కల్చర్ రాథోడ్ పా ర్వతి, ములుగు ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్ రాఘవేంద్ర, సం బంధిత అధికారులు పాల్గొన్నారు.