Hyderabad: బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యమకారులకు తీరని అన్యాయం
ABN , Publish Date - Jan 03 , 2025 | 08:07 AM
బీఆర్‌ఎస్(BRS) పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి
హైదరాబాద్: బీఆర్‌ఎస్(BRS) పదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను వెంటనే అరెస్ట్ చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, బియ్యం, ఫోన్‌ట్యాపింగ్, ఈ కార్ రేసింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)లో అవినీతి అక్రమాలకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై వెంటనే విచారణ జరిపించి జైలులో పెట్టాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..
అనంతరం సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యమకారుల జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రఫుల్ రాంరెడ్డి, కోశాధికారి చంద్రన్న ప్రసాద్, నాయకులు డోలక్ యాదగిరి, పి.గండయ్య, అరుణ, అంజలి, రేణుక, శంకర్‌రావు, వెంకటస్వామి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News