Share News

గంజాయి నియంత్రణ పై నిఘా ఉంచాలి

ABN , Publish Date - Mar 25 , 2025 | 11:25 PM

గంజాయి ని యంత్రణపై పటిష్టమైన నిఘా ఉంచి పూర్తిగా నిషేధించేం దుకు చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు.

గంజాయి నియంత్రణ పై నిఘా ఉంచాలి
ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది రివార్డు అందజేస్తున్న సీపీ అంబర్‌కిషోర్‌ఝా

రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ఝా

మంచిర్యాలక్రైం, మార్చి25(ఆంధ్రజ్యోతి): గంజాయి ని యంత్రణపై పటిష్టమైన నిఘా ఉంచి పూర్తిగా నిషేధించేం దుకు చర్యలు చేపట్టాలని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ ఝా అన్నారు. రామగుండం కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో నెల వారి కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ స మావేశానికి డీసీపీలు, అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌లు, ఏసీపీ లు, ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. ముందుగా పోలీసు స్టేషన్‌ డివిజనల్‌ జోన్లవారిగా పెండింగ్‌ కేసులకు సంబం ధించి నేరస్తుల అరెస్టు, దర్యాప్తు సాక్ష్యాధారాల సేకరణ, చా ర్జిషీటుకు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై ఆయ న అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యం గా నమోదైన గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్థి నేరా లు, ఫోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతోపాటు కేసుల పరి ష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని స్టేషన్‌ వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతి ఒక పోలీసు అధికారి చట్టబద్దంగా పని చే యాలని, మంచిగా పని చేసినప్పుడు వారికి గుర్తింపు వ స్తుందన్నారు. ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో న్యాయపరంగా, పారదర్శ కంగా విచారణ జరుపాలని, ప్రతి రోజు ఒక రెండు గంటల పాటు పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులకు, బాధితు లకు సమయం కేటాయించాలన్నారు. అలాగే పెండింగ్‌ కే సులను సమీక్షించాలన్నారు. ఏదైన సంఘటన జరిగిన ప్పు డు ఫిర్యాదు చేసినప్పుడు సంఘటన స్థలాన్ని తప్పనిసరిగ్గా వెళ్లాలని సూచించారు. అప్పుడే క్షేత్రస్థాయి సమాచారం సేక రించగలుగుతారన్నారు. ఈ సందర్భంగా గంజాయి స్వాధీ నం కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి రివార్డులను అందజేశారు.

Updated Date - Mar 25 , 2025 | 11:25 PM