ఢిల్లీ లిక్కర్ స్కాంను మించి ఏపీలో..

ABN, Publish Date - Mar 25 , 2025 | 02:10 PM

జగన్మోహన్ రెడ్డి భారీ లిక్కర్ స్కాంకు పాల్పడ్డారని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్థదేవరాయలు అన్నారు. రూ. 18వేల 5 వందల కోట్లపైచిలుకు అవినీతి జరిగిందంటూ ఆయన పార్లమెంట్‌లో చెప్పారు. రూ. 4 వేల కోట్లు బినామీల పేరుతో విదేశాలకు తరలించారని అన్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ Delhi) లిక్కర్ స్కామ్‌ను (Liquor Scam) మించి ఏపీలో లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్థదేవరాయలు (TDP MP Lavu Sri Krishnadevarayalu) అన్నారు. కలెక్షన్ల పరంగా పుష్ప, ఆర్ఆర్ఆర్, బాహుబలి వాటిని మించి జగన్మోహన్ రె్డ్డి (Jagan Mohan Reddy) లిక్కర్‌లో కలెక్షన్లు వసూలు చేశారంటూ ఆయన ఛలోక్తులు వేస్తూ క్లియర్‌గా చెప్పారు. వైఎస్సార్‌సీపీ హయాంలో దాదాపు రూ. 99 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే అందులో రూ. 18వేల 5 వందల కోట్లపైచిలుకు అవినీతి జరిగిందంటూ ఎంపీ సోమవారం పార్లమెంట్లో చెప్పారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు.

Also Read..:

మంత్రి నారా లోకేష్ సమక్షంలో సిస్కోతో ఒప్పందం


రూ. 4 వేల కోట్లు బినామీల పేరుతో విదేశాలకు తరలించారని ఎంపీ లావు శ్రీకృష్థదేవరాయలు ప్రస్తావించారు. ఏపీలో ఉన్న డిస్టలరీలను వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారని.. కొన్ని బెదిరించి.. మరికొన్ని ప్రలోభాలకు గురిచేసి తీసుకున్నారని ఆయన అన్నారు. ఏపీ బేవరేజస్‌కు కొత్త బ్రాండ్లను కేటాయించి.. వాటిని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించారని శ్రీకృష్థదేవరాయలు పేర్కొన్నారు. లిక్కర్ స్కాం వల్లే రాజ్యసభలో ఓ ఎంపీ నాలుగేళ్ల పదవి కాలం ఉన్నా రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ ఆయన చెప్పారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదుల యత్నం.. పోలీసుల అరెస్టు..

రజినీ ఫిర్యాదుతోనే తనిఖీలు: జాషువా

మీర్‌పేట మాధవి హత్య కేసులో కీలక మలుపు..

ABN Live..: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

For More AP News and Telugu News

Updated at - Mar 25 , 2025 | 02:10 PM