టెక్నాలజీతో కేటుగాళ్లను పట్టుకున్న విజయవాడ పోలీసులు
ABN , Publish Date - Feb 02 , 2025 | 10:08 PM
రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్‌తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు.

రైలు ఎక్కారు.. నిఘా పెట్టారు. అందరూ నిద్రపోయిన వెంటనే పని మొదలు పెట్టారు. ఇలా డబ్బు బ్యాగ్‌తో ఉడాయించిన కేటుగాళ్లను విజయవాడ పోలీసులు టెక్నాలజీ సాయంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరి నుంచి నగదును రికవరీ చేశారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాలు కట్టడి అవుతున్నాయనేది పోలీసులు చెబుతున్న మాట. దొంగతనం చేసి పారిపోయిన కేటుగాళ్లను సీసీ కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు.
రాజమండ్రి నుంచి ఫాలో చేసిన దొంగలు విజయవాడలో డబ్బులు కాజేసి పరారయ్యారు. చివరికి టెక్నాలజీ సాయంతో పోలీసులకు చిక్కారు. రాజమండ్రికి చెందిన పింటు, రాకేష్ కుమార్ జైన్ అనే అన్నదమ్ములు బంగారం వ్యాపారం చేస్తున్నారు. వీరి వద్ద పనిచేసే మనోజ్ కుమార్, హితేష్ కుమార్ అనే ఇద్దరికి రూ.64 లక్షలు ఇచ్చిన రాకేష్ చెన్నై వెళ్లి ఆ డబ్బులను ఇవ్వాలని చెప్పారు. భువనేశ్వర్ నుంచి చెన్నై మీదుగా రామేశ్వరం వెళ్లే రైలులో మనోజ్, హితేష్ టికెట్లు బుక్ చేసుకున్నారు. జనవరి 24న డబ్బు బ్యాగ్‌తో ఇద్దరు ట్రైన్ ఎక్కారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
