అబద్ధాలు చెప్పకండి!

ABN, Publish Date - Apr 02 , 2025 | 09:35 PM

ఇటీవల రాజమండ్రిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సోదరుడు కిరణ్ పగడాల సంచలన వీడియో బుధవారం విడుదల చేశారు. తన సోదరుడు ప్రవీణ్ పగడాల మృతిపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సోదరుడు ప్రవీణ్ మరణాన్ని కొంతమంది రాజకీయంగా వాడుకొని లబ్ది పొందాలని చూస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. అయితే తమ కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.

పోలీసు శాఖ సైతం నిష్పక్షపాతంగా విచారణ చేపడుతుందని చెప్పారు. పగడాల మృతిపై నిజానిజాలు బయటకు వచ్చే వరకూ సంయమనం పాటించాలని ప్రజలకు సూచించారు. లేని పోనీ కథలు అల్లి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొందరు ప్రయత్నించడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న విచారణపై తమకు పూర్తి స్థాయి నమ్మకం ఉందని కిరణ్ పగడాల స్పష్టం చేశారు.

మరోవైపు.. పాస్టర్ ప్రవీణ్ పగడాల భార్య జెస్సికా పగడాల సైతం వీడియో విడుదల చేశారు. తన భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దంటూ ఆమె వీడియో విడుదల చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంత మంది తన భర్త మరణాన్ని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసు మార్గంలో నడిచే ఎవ్వరూ మత విద్వేషాలు రెచ్చగొట్టరని చెప్పారు. తన భర్త ప్రవీణ్ ఎప్పుడూ మత సామరస్యం కోరుకునేవారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న విచారణపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పోలీసుల విచారణ సక్రమంగా జరుగుతుందన్నారు. ప్రవీణ్ మరణాన్ని రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని అనుకోవడం దారుణమని ఆమె వ్యాఖ్యానించారు.

Updated at - Apr 02 , 2025 | 09:39 PM