హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత
ABN, Publish Date - Apr 02 , 2025 | 03:52 PM
HCU High Tension: హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థుల ఆందోళనకు వర్సిటీ ప్రొఫెసర్లు మద్దతు తెలుపుతూ.. వారు కూడా ధర్నాలో పాల్గొన్నారు.

హైదరాబాద్, ఏప్రిల్ 2: హెచ్‌సీయూ (HCU) భూముల రగడ కొనసాగుతోంది. విద్యార్థులకు మద్దతుగా వర్సిటీ ప్రొఫెసర్లు ధర్నా నిర్వహించారు. అయితే ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో హెచ్‌సీయూ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్లు మాట్లాడుతూ.. భారతదేశం మొత్తంలో హెచ్‌సీయూ ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలమన్నారు. అనేక మంది విద్యార్థులను ఐఏఎస్, పొలిటీషయన్లు, శాస్త్రవేత్తలను అందించిన గొప్ప విశ్వ విద్యాలయం హెచ్‌సీయూ అని చెప్పుకొచ్చారు. అలాంటి విశ్వవిద్యాలయాన్ని అనేక మంది ఆక్రమించేందుకు ప్రయత్నించినా వాటన్నింటినీ అడ్డుకున్నామన్నారు.
కానీ.. ఇందిరాగాంధీ ఏ మహదాశయంతో ఇంత గొప్ప విశ్వవిద్యాలయాన్ని స్థాపించారో.. ఇప్పుడు ఆమె వారసులమని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తూట్లు పొడవడం అత్యంత హేయమైన చర్య అని వర్సిటీ ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
CM Revanth BC Bill Demand: మాపై ఆధిపత్యం వద్దు.. గల్లీలోకి రావాల్సిందే.. ప్రధానిపై రేవంత్ కామెంట్స్
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Read Latest Telangana News And Telugu News
Updated at - Apr 02 , 2025 | 03:52 PM