ఆ బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులకు షాక్
ABN, Publish Date - Feb 16 , 2025 | 12:18 PM
ఓ బ్యాంక్‌లో కొంతమంది ఖాతాదారులు బంగారం తాకట్టు పెట్టి రూ. 54 కోట్లు రుణం తీసుకున్నారు. కొద్ది రోజులు పోయిన తర్వాత ఆ డబ్బు బ్యాంక్‌కు కట్టి.. బంగారం విడిపించుకుందామని వచ్చారు. అయితే బ్యాంక్‌కు వచ్చిన ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు.

కాకినాడ జిల్లా: తేటగుంటలోని కెనరా బ్యాంకు (Canara Bank)లో ఘరానా మోసం (Gharana Fraud) వెలుగులోకి వచ్చింది. బంగారం తాకట్టు పెట్టి రూ. 54 కోట్ల (Rs, 54 crores) వరకు ఖాతాదారులు రుణం తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత గోల్డ్ రుణం తీర్చేసి బంగారం తీసుకుందామని బ్యాంక్‌కు వెళ్లిన ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. 150 ఖాతాలకు సంబంధించి రూ. కోటి విలువైన బంగారం మాయమైనట్లు గుర్తించారు. ఈ ఘటనలో విచారణ జరిపిన అధికారులు బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అప్రైజర్‌ను సస్పెండ్ చేశారు. ఇప్పటి వరకు 12 మంది ఖాతాదారులు బంగారం పోయిందని ఫిర్యాదు చేశారని, బ్యాంక్ మేనేజర్ ఇన్చార్జ్ తెలిపారు. త్వరలోనే బాధితులకు బంగారం తిరిగి అప్పగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
ఈ వార్తలు కూడా చదవండి..
డబ్బుల కోసం సైకోగా మారిన ఓ భర్త..
కూతురితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో..
రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 16 , 2025 | 12:18 PM