టీపీసీసీ చీఫ్ కరాటేలో బ్లాక్ బెల్ట్..
ABN, Publish Date - Apr 01 , 2025 | 12:18 PM
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కరాటే బ్లాక్ బెల్టు అందుకున్నారు. ఏకంగా మూడు గంటల పాటు టెస్టుల్లో పాల్గొని ఆయన ఈ ఘనత సాధించారు. మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయాల్లోనే కాకుండా కరాటేలో కూడా తన సత్తా ఏంటో నిరూపించారు.
హైదరాబాద్: రాజకీయాలతో ప్రత్యర్జులను వాడీ వేడిగా తన వాగ్ధాటితో కౌంటర్లు ఇస్తూ బిజీ బిజీగా కనిపించే తెలంగాణ పీసీసీ చీఫ్ (Telagana TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కరాటే (karate)లో బ్లాక్ బెల్ట్ (Black Belt) సాధించారు. సికింద్రాబాద్, వెస్ట్‌మారేడ్‌పల్లి రోడ్డులోని వైడబ్ల్యూసీఏలో జరిగిన నైపుణ్య పరీక్షలో ఆయన ఒకీనవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కరాటే బ్లాక్ బెల్ట్ ధృవ పత్రాన్ని అందుకున్నారు. తన జీవితంలో కరాటే ఒక భాగమని 2027లో నగరంలో ఆసియా కరాటే పోటీలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను కంప్యూటర్ కిడ్స్‌గా తయారు చేస్తూ వారిని మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: హెచ్‌సీయూ భూములపై రాజకీయ రగడ..
ఈ వార్తలు కూడా చదవండి..
KTR: హెచ్‌సియూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏమిటి..
హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..
ఢిల్లీ బాట పట్టిన అఖిలపక్షం నేతలు..
For More AP News and Telugu News
Updated at - Apr 01 , 2025 | 12:18 PM