ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగానే వుంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సం దర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన నివేదికలో తేలింది.
గ్యాస్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఒక్కొక్క గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పక్షవాతంతో మంచంలో పడి ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి ఆపై అత్యాచారం చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు అపహరించారు.
పని చేస్తున్న చోట యజమాని రాకపోకలను గమనించి దోపిడీకి పాల్పడ్డారు.
జిల్లాలోని రామాలయాలు, భక్తాంజనేయ స్వామి ఆలయాలు, యువత ఏర్పాటు చేసిన పందిర్లలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
రాష్ట్రంలో అన్నదాతలకు ప్రయోజనం కలిగే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, నిర్దేశిత రైస్‌మిల్లు అనేది లేకుండా రైతులు నచ్చిన మిల్లుకు ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ము కోవచ్చని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
అమెరికా విధించిన సుంకాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి రొయ్య రైతులను కాపాడాలని రొయ్య రైతుల సంక్షేమ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి రుద్రరాజు యువరాజు డిమాండ్ చేశారు.
నిత్యావసరాల ధరలు నిలకడగానే కొన సాగుతున్నాయి. ప్రధానంగా నిత్యావసరాలు రైతుల నుంచి చేపట్టిన దిగుమతులపై 1.27 శాతం సుంకం వసూళ్లను చేపడుతుండ టంతో ధరలు నిలకడగా ఉంటున్నాయి.
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే వల్ల ఆక్వా రంగానికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రీసర్వే తో గ్రామాల్లో చేపల, రొయ్యల చెరువులకు, పంటపొలాలకు కొత్తగా ఎల్పీ నెంబర్లు ఇచ్చా రు. అయితే ఆక్వా జోన్లో ఉన్న లక్షలాది ఎక రాలు ఎల్పీ నెంబర్లతో నాన్ ఆక్వాజోన్‌లో ఉన్నట్టు ఆన్లైన్లో చూపడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాలకు నీటిని తీసు కుని వెళ్లే డెల్టా కాలువలను ఈ నెల 16న మూసివేయనున్నారు.