Home » Araku
Andhrapradesh: జిల్లాలోని అరకులో విద్యుత్ సరఫరా నిలిచిచిపోయింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో అరకు పరిసర ప్రాంతాలలో గత రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలులు విపరీతంగా వీస్తుండడంతో విద్యుత్ వైర్లపై చెట్లు కొమ్మలు పడుతుండడం వలన విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు.
సహజ సిద్ధంగా ఏర్పడిన బొర్రా గుహలకు.. కొత్తవలస-కిరండోల్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులతో ముప్పు వాటిల్లేలా ఉంది. రెండో ట్రాక్‌ను బొర్రా గుహలపై నుంచి నిర్మిస్తే గుహలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఆంధ్ర ప్రత్యేక కాఫీ గురించి ప్రధాని ప్రస్తావించారు. అరకు ఏజెన్సీలో పండించే ప్రత్యేక కాఫీ గురించి మోదీ దేశ ప్రజలకు వివరించారు.
అరకులోయ పార్లమెంట్ స్థానంలో సాలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ (Telugu Desam) ఎమ్మెల్యేగా విజయం సాధించిన గుమ్మిడి సంధ్యారాణికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కడం పట్ల కూటమి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు...
ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఏపీ సార్వత్రిక ఎన్నిక (AP Election 2024)ల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తూ కదన రంగంలో దూసుకెళ్తున్నాయి. సీపీఎం (CPM) పార్టీ కూడా ఈరోజు(సోమవారం) అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పోరుకు సిద్ధమైంది. సీపీఎం పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు.
అరకు (Araku) ఎంపీగా తనను గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అరకు బీజేపీ (BJP) పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత (Kothapalli Geetha) అన్నారు. విద్య, వైద్యం, సొంతింటి కల, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అరకులో ఉన్న గిరిజనుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.
Andhrapradesh: అరకులోయలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. గత రాత్రి అరకులోయ మండలంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింహాద్రి (28)ని కేజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. అరకు కాఫీ ఎలా ఉంది భువనేశ్వరీ అంటూ ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చారు. అరకు పర్యటనలో భాగంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అరకు కాఫీ తాగుతున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
తెలుగుదేశం (TDP) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరుతో పరామర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నుంచి మార్చి ఒకటో తేదీ వరకు ఆమె ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు.
జిల్లాలోని అరకు లోయ సమీపంలో ఉన్న హాస్టల్లో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక హాస్టల్లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుతోంది. మృతిచెందిన బాలికను దుంబ్రిగూడ మండలం ఓంబి గ్రామానికి చెందిన వసంతగా గుర్తించారు.