Home » Ayyanna Patrudu
నవ్యాంధ్రప్రదేశ్ 3వ శాసనసభా సభాపతిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయ్యన్న పేరును ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. నూతన స్పీకర్గా అయ్యన్న బాధ్యతలు స్వీకరించారు. ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ పక్షనేతలు గౌరవప్రదంగా సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ రావడంతో అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి(శుక్రవారం) నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 72 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే.
ఏపీ శాసనసభ స్పీకర్గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.
Andhrapradesh: వై నాట్ 175 సౌండ్ తగ్గింది.. వైసీపీకి భయం మొదలైంది అని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి సమాధి కట్టడానికి ప్రజలు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎన్నికల సక్రమంగా జరగవని జగన్ అంటుంటే తమకు ఆశ్చర్యంగా ఉంది.. ఎన్నికల్లో గొడవలు పెట్టి జగన్ ఈ విధంగా మాట్లాడటం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు.
తమపై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పలువురు అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాలపై డీజీపీ స్పందించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....
ఈసారి జరుగబోయే ఎన్నికలే తనకు చివరి అవకాశంగా భావించి తనను గెలిపించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు టీడీపీ(TDP) సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు(Chintakayala Ayyanna Patrudu). అనకాపల్లి(Anakapalle) జిల్లా నర్సీపట్నంలో(Narsipatnam) నిర్వహించిన మహిళా మేలుకో కార్యక్రమంలో చింతకాయ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) రెండోసారి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అధికార వైసీపీ (YSR Congress).. తొక్కాల్సిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. కూటమిని చీల్చడం వల్ల కాదని తెలుసుకున్న వైసీపీ.. ఇక టీడీపీలోని కీలక నేతల కుటుంబాలను టార్గెట్ చేస్తూ.. వారిని పార్టీలోకి లాగడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది..
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావును మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు ఆదివారం నాడు కలిశారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి వస్తున్నారని అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు.