AP Assembly: విశాఖ జిల్లాకు మొదటిసారిగా ఆ పదవి..
ABN , Publish Date - Jun 17 , 2024 | 09:28 AM
ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది.
ఏపీ శాసనసభ స్పీకర్‌గా నర్సీపట్నం టీడీపీ ఎమ్మెల్యే అయ్యనపాత్రుడును టీడీపీ ఎంపిక చేసింది. దీంతో స్పీకర్ ఎన్నిక నోటిఫికేషన్ రాగానే ఆయన నామినేషన్ దాఖలు చేస్తారు. పూర్తి సంఖ్యాబలం ఉండటంతో అయ్యనపాత్రుడు ఎంపిక లాంఛనప్రాయం కానుంది. దీంతో విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్రా నుంచి స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్న రెండో వ్యక్తి అయ్యన్నపాత్రుడు కానున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా నుంచి స్పీకర్ కానున్న మొదటి వ్యక్తిగా ఆయన నిలవనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఏపీలో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. మొదట స్పీకర్‌గా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రెండో శాసనసభ స్పీకర్‌గా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఎన్నికయ్యారు. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు స్పీకర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆంధ్రరాష్ట్రంలోనూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్పీకర్లుగా ఉత్తరాంధ్రాకు చెందిన నాయకులు పనిచేశారు. ఆంధ్రరాష్ట్రంలో రెండో శాసనసభ స్పీకర్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన రొక్కం లక్ష్మి నరసింహదొర పనిచేశారు. 1955 ఏప్రిల్ 23 నుంచి 1956 డిసెంబర్ 3 వరకు ఆయన ఆంధ్రరాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అదే జిల్లాకు చెందిన తంగి సత్యానారాయణ, కె ప్రతిభా భారతి సైతం స్పీకర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన తొలి తెలుగుదేశం ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తంగి సత్యనారాయణ స్పీకర్‌గా పనిచేశారు. దీంతో ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తులు ఎంతోమంది స్పీకర్లుగా పనిచేశారు.
Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న
ముగ్గురూ ఆ పార్టీ నుంచే..
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో స్పీకర్‌గా పనిచేసిన తమ్మినేని సీతారాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాయకుడు. ఆయన 2019లో వైసీపీ నుంచి ఆముదాలవలస ఎమ్మెల్యేగా గెలిచారు. అయినప్పటికీ ఆయన తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. అలాగే మొదటి శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో ప్రారంభించి.. చివరి వరకు అదే పార్టీలో కొనసాగారు. మూడో శాసనసభ స్పీకర్‌గా ఎన్నికకానున్న అయ్యన్నపాత్రుడు తన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశంతోనే ప్రారంభించారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఉత్తరాంధ్రాకు చెందిన నాయకులే. అయ్యన్నపాత్రుడు సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో వైసీపీ స్పీకర్ పదవిని బీసీ సామాజిక వర్గానికి కేటాయించగా.. ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కూడా బీసీ సామాజిక వర్గానికే ఆ పదవిని కేటాయించింది. మరోవైపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఇప్పటివరకు ఎవరూ స్పీకర్ కాలేదు. తొలిసారిగా అయ్యన్నపాత్రుడు ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు.\
Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News