Share News

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!

ABN , Publish Date - Jun 17 , 2024 | 08:37 AM

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.

AP Politics: టీడీపీ ప్రభుత్వంలో బీసీలకు న్యాయం.. గొప్పలకే పరిమితమైన గత ప్రభుత్వం..!
TDP Leaders

తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది. కానీ బీసీలకు కొంతమేర అన్యాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. వాటికి నిధులు కేటాయించలేదు. మరోవైపు కీలకమైన పదవుల కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. కానీ ఏపీలో ప్రభుత్వం మారింది. దీంతో బీసీలకు మరోసారి మంచి రోజులు వచ్చినట్లైంది. చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని 24 మందిలో 8మంది మంత్రలుు బీసీలు ఉన్నారు. వీరిలోనూ అన్ని కులాలకు ప్రాధాన్యం ఉండేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు పల్లా శ్రీనివాసరావు అప్పగించారు. శాసనసభలో కీలకమైన స్పీకర్ పదవిని బీసీకి కేటాయించనున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీసీ ఓటర్లు టీడీపీ కూటమికి అండగా నిలివడంతో భారీ విజయం సాధించగలిగింది. ఎన్నికల ముందు సైతం బీసీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు కీలక పదవులను బీసీలకు కేటాయిస్తుూ వస్తుండటంతో ఆ సామాజిక వర్గం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh Assembly : స్పీకర్‌గా అయ్యన్న


గతంలో గొప్పలు..

సామాజిక న్యాయం చేసి చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనంటూ గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. మాజీ సీఎం జగన్ ప్రతి మీటింగ్‌లో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలంటూ గొప్పులు చెప్పుకునేవారు. కానీ వాస్తవానికి రాష్ట్ర జనాభాలో అధికశాతం ఉన్న బీసీలకు న్యాయం చేయలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. తన సామాజిక వర్గం నేతలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని.. కేవలం పేరుకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు కేటాయించినా పెత్తనం మాత్రం ఆ జిల్లాలోని జగన్ సామాజిక వర్గానికి చెందిన నేతలదేనన్న ఆరోపణలు విమర్శించాయి. దీంతో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదనే ఉద్దేశంతోనే ఈ ఎన్నికల్లో వైసీపీకి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు తగిన గుణపాఠం చెప్పినట్లు తెలుస్తోంది.

CM Chandrababu : టీడీపీ సారథిగా పల్లా శ్రీనివాసరావు


టీడీపీ ప్రభుత్వంలో..

తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా వారం రోజులు కూడా గడవలేదు. ఈలోపు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది. బహిరంగంగా ఎటువంటి ప్రకటనలు చేయకుండానే.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రతి విషయంలో ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే మంత్రివర్గం మొదలు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకం వరకు బీసీలకు ఆ పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎనిమిది మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడం, రాష్ట్ర అధ్యక్షుడిగా ఓ బీసీ నేతను నియమించడం, స్పీకర్ పదవి బీసీ నేతలు ఇస్తుండటంతో పాటు రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు సమన్యాయం చేస్తామని సంకేతాలు ఇచ్చారు. సామాజిక న్యాయం ప్రచారం కోసం కాదని.. అమలులో చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అంటూ ఆ సామాజిక వర్గం నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Macharla Police: పిన్నెల్లి సోదరులపై రౌడీషీట్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 17 , 2024 | 09:16 AM