Home » Bengaluru News
బెంగళూరు నగరంలో వర్షాలు సాధారణమే. ఏడాదిలో ఏడెనిమిది నెలలపాటు ఇక్కడ వర్షం కురుస్తుంది. అయితే, జూన్ ఆరంభంలోనే ఆదివారం ఒకే రోజు ఏకంగా 110.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల నాటి రికార్డును బద్ధలు కొట్టింది.
భారీ వర్షంతో బెంగుళూరు మహానగరం తడిసి ముద్దయింది. బెంగుళూరులో ఆదివారం ఒకే రోజు 111.1 మి.మి వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. 133 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఒకే రోజు 101.6 మి.మి వర్షపాతం నమోదై.. రికార్డు సృష్టించిందని తెలిపారు.
ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకునే ప్రక్రియకు కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP)లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆశావహులసంఖ్య ఎక్కువగా ఉండడంతో ఇరు పార్టీల రాష్ట్రనేతలు అధిష్ఠానంకు జాబితాలు పంపి చేతులు దులుపుకున్నారు.
ప్రజ్వల్ రేవణ్ణ అశ్వీల వీడియోల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవణ్ణ (Prajwal Revanna) జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ కి గురైన విషయం తెలిసిందే. ఆమె తల్లి భవానీ రేవణ్ణను ఇంటి వద్దే ఉండాలని సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆమె ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.
చికిత్స నిమిత్తం మంగళూరు ఆసుపత్రికి వచ్చిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేరళకు చెందిన జిమ్ ట్రైనర్ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
మహిళలపై లైంగిక దాడికి పాల్పడటం, అశ్లీల వీడియోలను రికార్డు చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ..
న్నికల వేళ.. పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. ఓ పుకారు బెంగళూరు మహానగరంలో షికారు చేస్తుంది. దీంతో ఆ నగరంలోని ముస్లిం మహిళలంతా ఖాతాలను తెరిచేందుకు పోస్టాఫీసులకు పోటెత్తుతున్నారు.
మైసూరు జిల్లా అధికారిగా పనిచేసిన రోహిణి సింధూరి(Rohini Sindhuri) అక్కడి అతిథిగృహంలో ఉండేవారు. ఇదే సందర్భంలో పలు వస్తువులు మాయమయ్యాయి. వాటికి సంబంధించి నగదు సమకూర్చాలని పర్యవేక్షణ సంస్థ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం రోహిణి సింధూరి వేతనం నుంచి కోత విధించాలని ప్రభుత్వాన్ని కోరింది.
రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన సినీనటి హేమ పోలీసు విచారణకు గైర్హాజరయ్యారు.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.