Home » Bengaluru
రుణం తిరస్కరించడమేనన్న కారణంతో, ఓ వ్యక్తి తన ముఠాతో బ్యాంకు లాకర్లలో ఉన్న రూ.12.95 కోట్ల విలువైన బంగారాన్ని అపహరించాడు. పోలీసుల దర్యాప్తుతో ఆ బంగారం స్వాధీనం అయింది
Bengaluru: ఈ బస్టాండ్ మీదుగా ప్రతిరోజూ దాదాపు 200 బస్సులు తిరుగుతూ ఉంటుంది. నిత్యం ఈ ప్రదేశం ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎండ, వర్షం వచ్చినపుడు ఇక్కడే గుమిగూడతారు. ఎప్పుడూ రద్దీ ఉండే ఈ బస్టాప్ కొన్ని రోజుల క్రితం అకస్మాత్తుగా అదృశ్యమైపోవడమే అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
బెంగళూరు నగరంలో పది రోజుల్లో రెండు దారుణ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఘటనలో బిజినెస్ మ్యాన్.. తన భార్య, అత్త చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మరో ఘటనలో ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు.
ఈ మధ్య కాలంలో కల్తీ రాయుళ్లు బరితెగించేస్తున్నారు. ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా కల్తీకి పాల్పడుతున్నారు. వెజ్ తినే వాళ్లు ఎంతో ఇష్టపడే పనీర్ను సైతం వదిలిపెట్టడం లేదు.
అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28వ తేదీన బెంగళూరు-కలబురగి మధ్య (వయా గుంతకల్లు) అప్ అండ్ డౌన్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవాలని అధికారులు కోరారు.
మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావు 12.56 కోట్లు విలువచేసే బంగారంతో పట్టుబడింది. ఆ తర్వాత ఆమె నివాసంపై జరిపిన దాడుల్లో 2.06 కోట్లు విడుదల చేసే నగలు, 2.06 కోట్ల నగదు పట్టుబడింది.
ముస్లింలకు 2B కేటగిరి కింద 4 శాతx రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంపై అడిగిన ఒక ప్రశ్నకు దత్తాత్రేయ హోసబలె సమాధానమిస్తూ, ఇదే తరహా ప్రయత్నాలు గతంలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో జరిగినప్పటికీ సంబంధించి హైకోర్టులు కొట్టేశాయని చెప్పారు.
భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా 10 విమానాలను ఆకస్మాత్తుగా పక్క నగరమైన చెన్నైకి మళ్లించారు. ఇది ఎక్కడో కాదు. గ్రీన్ సిటీ బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. దీనిపై పలువురు ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంఘ్ కింద 32 సంస్థలు పనిచేస్తున్నాయనీ, ప్రతి ఆర్గనైజేషన్ స్వతంత్రంగా పని చేస్తుందని, సొంతగానే నిర్ణయాలు తీసుకుంటారని అరుణ్ కుమార్ చెప్పారు. ప్రతి సంస్థకు సొంత సభ్యులు, ఎన్నికలు, స్థానిక-జిల్లా-మండల స్థాయిలో సొంత వ్యవస్థ ఉంటుందన్నారు.
రోడ్లపై ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు పక్క వాహనాలు తాకుతుండటం లేదా ఆ వాహన డ్రైవర్లతో గొడవలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో గొడవ పెరగడం లేదా పట్టించుకోకుండా వెళ్లడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ బైకర్ వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లో నిలిచారు.