Home » Budget 2024
రేవంత్ సర్కారుకు పాత అప్పుల కుప్ప పెద్ద సంకటంగా మారింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధుల కేటాయింపులకు కూడా రూ.6,71,757 కోట్ల మేర ఉన్న అప్పులే ప్రతిబంధకంగా మారుతున్నాయి.
ఉచిత/రాయితీతో విద్యుత్ పొందే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరగడంతో విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన సబ్సిడీ నిధులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
శాసన మండలిలో బడ్జెట్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
రేవంత్ రెడ్డి సర్కారు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్‌లో 25 శాతం ఆ రంగానికే కేటాయించింది. బడ్జెట్ మొత్తం రూ.2,91,159 కోట్లు కాగా.. ఇందులో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.72,659 కోట్లు కేటాయించింది.
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టును సాధించాలన్న లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు నిధులు కేటాయించింది.
పురపాలక, పట్టణాభివృద్ధికి బడ్జెట్‌లో సర్కారు రూ.15,594 కోట్లు కేటాయించింది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో వ్యూహాత్మక అభివృద్ధి ప్రణాళికలకు అనుగుణంగా నిధుల కేటాయింపులు జరిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది.
బీజేపీవాళ్లు చెబితేనే.. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారని, మీడియా పాయింట్ వద్ద బడ్జెట్‌పై మాట్లాడారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ముందునుంచీ చెబుతున్నట్లుగానే బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తం రూ.2,91,159 కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అత్యధికంగా రూ.72,569 కోట్లను వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పూర్తిస్థాయిలో నెరవేరేలా కనిపించడంలేదు. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించినా.. చెప్పిన ఇళ్లకు అవి సరిపోయే పరిస్థితి లేదు.