Budget Presentation: శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Jul 26 , 2024 | 04:09 AM
శాసన మండలిలో బడ్జెట్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్, జూలై 25(ఆంధ్రజ్యోతి): శాసన మండలిలో బడ్జెట్‌ను ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తరఫున శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. గంట 40 నిమిషాల పాటు ఆ ప్రసంగం కొనసాగింది. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడుతున్నట్టు శ్రీధర్‌బాబు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో ఆదాయం, అప్పులు, ఇతర మార్గాల ద్వారా సమకూరిన నిధుల వ్యయానికి, రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతన లేక పోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ గత డిసెంబర్ నుంచి నేటి వరకు 34,579 కోట్లు వివిధ పథకాల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.