Home » CM Revanth Reddy
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోతుందనే విషయం ప్రధాని మోదీకి ముందే తెలిసిపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. అందుకే మోదీ మూడు రోజులుగా ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లి పోయారన్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపై రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది.
KTR vs Revanth: లగచర్ల ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ మరోమారు రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..
లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని తెలిపారు.పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయారని.. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన సాగుతోందని మంత్రులు కొండా సురేఖ, సీతక్క కొనియాడారు.
‘‘రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఒకరు రేవంత్రెడ్డి కాగా, మరొకరు కేటీఆర్. ఇక్కడ ఆర్కే (రేవంత్రెడ్డి, కేటీఆర్) బ్రదర్స్ పాలన నడుస్తోంది.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం పటాపంచలైందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆ ప్రాజెక్టుతో సంబంధమే లేకుండా ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం పండిందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కమల దళం రక్షణ కవచంలా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. లగచర్ల ఘటనను పక్కదారి పట్టించేందుకే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మూసీ నిద్ర అంటున్నారని తెలిపారు.
మూసీ పరీవాహక ప్రాంతాన్ని ప్రక్షాళన చేసే ముందు అక్కడ ఏళ్లుగా నివసిస్తున్న పేదలను ఒప్పించాలని, వారి అనుమతితో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సూచించారు.