Home » Congress Govt
ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజకీయ పార్టీ ఏదైనా సరే విమర్శలను, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు అనుమతిస్తున్నామని అన్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని అధికారులపై దాడులు చేస్తే ఊరుకోబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు.
అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం రైతుల ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్న రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మూసీ బాధితుల ఇంట్లోనే రేపు ఉంటాం, అక్కడే పడుకుంటామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మూసీ బాధితుల సమస్యలను పరిష్కరించేలా రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.
లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. కలెక్టర్‌పై దాడి చేయడం హేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ప్రభుత్వం బోగస్ కేసులు పెడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. లగచర్ల బాధితులను బాధితులను ఢిల్లీకి తీసుకెళ్తామని... నేషనల్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయిస్తామని కేటీఆర్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
అమృత్ 2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
నాసిరకం, నకిలీ మందులు తయారు చేసే వారితో పాటు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ(డీసీఏ) అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.