Home » Donation
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పాలనలో విధ్వంసానికి గురైన ఏపీ రాజధాని అమరావతికి(Amaravathi) విరాళాలు ఇవ్వడానికి రాష్ట్ర నలుమూలల నుంచి చాలా మంది ముందుకు వస్తున్నారు. తాజాగా ఏలూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థిని అమరావతి, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు శనివారం విరాళం ఇచ్చారు.
దేశ సంపదన, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువ మంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నగలను విరాళంగా ఇచ్చారని చెప్పారు.
అయోధ్య బాలరాముడుకి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుటుంబం భారీ విరాళం ప్రకటించింది. రూ.2.50 కోట్ల నగదును రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందజేస్తామని వెల్లడించింది.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలోని మహారాష్ట్ర శివసేన రూ.11 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు మహారాష్ట్ర నేతలు శనివారంనాడు అందజేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా పలు ప్రమాదాల్లో మృత్యువాత చెందిన 11 మంది క్రీయాశీలక సభ్యుల కుటుంబాలకు పవన్ రూ.55 లక్షల ఆర్థిక సాయం అందించారు.