Home » Duvvada Srinivas
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో రాత్రంతా ఉద్రిక్తత కొనసాగింది. పెద్ద కుమార్తె హైందవితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ నూతనంగా నిర్మించిన ఇంటికి ఆయన సతీమణి దువ్వాడ వాణి వచ్చారు. ఇంటి గేట్లను బలవంతంగా తెరిచి వాణి, హైందవిలు లోనికి ప్రవేశించారు...
Andhrapradesh: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తుపాకీ లైసెన్స్‌కు దరఖాస్తు చేశారు. తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ మహేందర్ రెడ్డికి ఈనెల 7న దువ్వాడ దరఖాస్తు చేసుకున్నారు. తనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటిముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మితిమీరి ప్రవర్తించారు. కొందరు నేతలు తమకు నిబంధనలు వర్తించవు అన్నట్టు ప్రవర్తించారు.
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ (YSR Congress) అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు (Duvvada Sreenivas) ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి, టెక్కలి జడ్పీటీసీ వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది..