BJP New President: మార్చి 30 కల్లా బీజేపీకి కొత్త అధ్యక్షుడు
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:01 PM
జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.

న్యూఢిల్లీ: మార్చి 30వ తేదీలోగా బీజేపీ (BJP)కి కొత్త జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీ రాష్ట్ర విభాగాల్లో ఎన్నికలు పూర్తికాగానే జాతీయ అధ్యక్షుడి ఎన్నికలు నిర్వహిస్తారు. జేపీ నడ్డా వారసుడిగా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరగాల్సి ఉండగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, పెండింగ్‌లో ఉన్న బీజేపీ రాష్ట్ర విభాగాల ఎన్నికలు కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది.
Delhi: అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక
పార్టీ రాజ్యాంగం ప్రకారం సగానికి సగం రాష్ట్ర విభాగాలకు ఎన్నికలు జరక్క ముందే జాతీయ అధ్యక్షుడి ఎన్నికల చేపట్టరాదు. ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను 12 చోట్ల ఎన్నికలు పూర్తయ్యాయి. రాబోయే కొద్దివారాల్లో ఆరు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికలు నిర్వహించే వీలుంది.
జేపీ నడ్డా తొలుత 2019 జూన్ 17న పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టి 2020 జనవరి 20 వరకూ కొనసాగారు. 2020 జనవరి 20న పార్టీ 11వ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. బీజేపీ తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్‌పేయి 1980 నుంచి 1986 వరకూ పనిచేశారు. లాల్ కృష్ణ అడ్వాణి పలుమార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986-1990, 1993-1998, 2004-2005 వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. మురళీ మనోహర్ జోషి 1991 నుంచి 1993 వరకూ, కుషబావు థాకరే 1998 నుంచి 2000 వరకూ, బంగారు లక్ష్మణ్ 2000-2001, కె జానా కృష్ణమూర్తి 2001-2002, ఎం వెంకయ్యనాడు 2002-2004, రాజ్‌నాథ్ సింగ్ 2005-2009, 2013-2014, నితిన్ గడ్కరి 2010-2013, అమిత్‌షా 2014-2017, 2017-2020 వరకూ పనిచేశారు. జేడీ నడ్డా 2020 నుంచి పార్టీ అధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?
Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్ బోర్డుకు తారు
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.