Home » Gaddar
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్‌ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు..
ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) అలియాస్ గుమ్మడి విఠల్ ఆదివారం మధ్యాహ్నం తిరిగిరానిలోకాలకు చేరుకున్నారు. ఆయన మరణంతో అభిమానులు, కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. అపోలో ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని నగరంలోని ఎల్బీస్టేడియానికి (LB Stadium) తరలించారు...
ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), పలువురు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కూడా ఉద్యమ గళానికి సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా.. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గులాబీ బాస్ స్మరించుకున్నారు...
ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూతపై పలువురు ప్రముఖలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ సీఎం జగన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్, కేశినేని చిన్ని, పోతుల బాలకోటయ్య, టీడీపీ నేత జవహర్, పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar passed away) కన్నుమూశారు.
ప్రజా యుద్ధ నౌక మూగబోయింది.. ఉద్యమ గళం ఊపిరి ఆగింది.. గద్దరన్న నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిశారు!. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) ఇకలేరన్న వార్త విన్న తెలుగు ప్రజలు, విప్లవకారులు, ఉద్యమకారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండ్రోజుల కిందటే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో (Apollo Hospital) గుండె ఆపరేషన్ (Heart Operation) సక్సెస్ అయ్యిందని కుటుంబీకులు, అభిమానులు సంతోషపడ్డారు.. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే.. రెండు మూడ్రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ సాధారణ మనిషిగా అందరి మధ్యలో తిరిగేవారు..!
ప్రజాయుద్ధనౌక గద్దర్ మరణం పట్ల ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, పార్టీలకు అతీతంగా నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన రచనలు, పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గద్దర్ జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను గుర్తుచేసుకుందాం.
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ప్రజా గాయకుడు గద్దరు(Gaddar)ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పరామర్శించారు.
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: తెలంగాణలో తెరపైకి మరో రాజకీయ పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ నేతృత్వంలో ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం బుధవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసారు.