Gaddar No More : గద్దర్ చివరి మాటలు గుర్తు చేసుకొని గుండెలవిసేలా రోదించిన విమల..!
ABN , First Publish Date - 2023-08-06T22:36:20+05:30 IST
నాకేం కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు.. సర్జరీ సక్సెస్ అయితది.. ఆరోగ్యంగా తిరిగొస్తా.. ఇంకో పదేళ్లు బతుకుతాను.. ఆరోగ్యం జాగ్రత్త.. ఇవీ ప్రజా యుద్ధనౌక గద్దర్ చివరిసారిగా తన సతీమణి విమలకు (Gaddar Wife Vimala) చెప్పిన మాటలు. అనుకున్నట్లుగానే గుండె ఆపరేషన్ (Heart Operation) విజయవంతంగా జరిగింది కానీ..
నాకేం కాదు.. నువ్వు ధైర్యంగా ఉండు.. సర్జరీ సక్సెస్ అయితది.. ఆరోగ్యంగా తిరిగొస్తా.. ఇంకో పదేళ్లు బతుకుతాను.. ఆరోగ్యం జాగ్రత్త.. ఇవీ ప్రజా యుద్ధనౌక గద్దర్ చివరిసారిగా తన సతీమణి విమలకు (Gaddar Wife Vimala) చెప్పిన మాటలు. అనుకున్నట్లుగానే గుండె ఆపరేషన్ (Heart Operation) విజయవంతంగా జరిగింది కానీ.. పదేళ్లు బతుకుతానన్న ఆ గొంతుక పదిరోజులకే మూగబోయింది. చివరిసారిగా ఆస్పత్రిలో తనతో మాట్లాడిన మాటలు గుర్తుచేసుకొని గుండెలు పగిలేలా రోదించారు. ఈ మాటలు విన్న గద్దర్ అభిమానులు, కవులు, కళాకారులు, సామాన్య ప్రజల కంట కన్నీళ్లు ఆగట్లేదు.!
పదేళ్లని చెప్పి..!
‘నాకేం కాదు.. మంచిగా ఆరోగ్యంగానే వస్తా బిడ్డా అన్నాడు. నాన్నా పదేళ్లు బతుకతా అన్నాడు.. శనివారం సాయంత్రమే నేను మాట్లాడాను.. బాగున్నావా అన్నాను.. నువ్వెలా ఉన్నావ్.. బాగున్నావా అని అడిగాడు. ఎంత బాధ ఉన్నా.. ధైర్యంగా ప్రోగ్రామ్ పోయి వస్తుండె. ఆస్పత్రికి వెళ్లేప్పుడు మేం భయపడితే.. ధైర్యం చెప్పి పోయిండు. పదిరోజులు ఆగుతాను.. ఇప్పుడే గుండె ఆపరేషన్ చేసుకోను అని డాక్టర్ల చుట్టూ తిరుగుతుండే. ఇప్పుడే చేస్తామని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు ఇలా జరిగిపోయింది. నాకు ఎప్పుడూ ధైర్యం చెబుతుండేవాడు. నేనున్నా కదా నీకేం కాదు అని చెబుతుండేవాడు.. నేనే అనారోగ్యంతో బాధపడుతుంటిని.. ఏం కాదు అని ధైర్యం చెబుతుండే. నేను ఆరోగ్యంగా వస్తా.. ఇంకా పదేళ్లు బతుకుతాను అని చెప్పిండు.. పదేళ్లు పోయి కనీసం పదిరోజులకే కూడా లేకుండా ఇలా పోయిండు. ఇవాళ చాలా అనారోగ్యానికి గురయ్యిండు.. ఆయన నోట మాట కూడా రాలేదు. ఎందుకు పోయిండో.. ఏమో.. దేవుడు చిన్న చూసిండు’ అని గుండెలవిసేలా విమల రోధించారు. కాగా రెండు నెలల కిందటే ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య విమలపై గద్దర్ పాట పాడి (Gaddar Song On Wife) భావోద్వేగానికి లోనయ్యారు.
చివరి కోరిక మేరకే..!
ఇదిలా ఉంటే.. అల్వాల్‌లో గద్దర్ స్థాపించిన స్కూల్ యుద్ధనౌక అంత్యక్రియలు జరగనున్నాయి. మహాబోధి విద్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించాలని గద్దర్ భార్య విమల సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు, టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మహోబోధి విద్యాలయంలోనే తన అంత్యక్రియలు నిర్వహించాలని స్వయాన గద్దరే చెప్పారు. ఆయన చివరి కోరిక మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే.. ఈ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిర్ణయించింది. ఈ మేరకు.. గద్దర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి సంబంధించిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని (TS Govt CS) సీఎం ఆదేశించారు. కాగా.. గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు, కవులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.